This is header
అవోపా హైదరాబాద్ వారి గణతంత్ర దినోత్సవ వేడుకలు


తేదీ 26.1.2020 రోజున అవోపా హైదరాబాద్ వారు వారి కార్యాలయములో 71 గణతంత్ర దినోత్సవ సందర్భముగా భారత జాతీయ మువ్వన్నెల జెండా అవిష్కరణ కార్యక్రమము నిర్వహించారు. అదే రోజున నిర్వహించిన మరో కార్యక్రమములో 10వ తరగతి మరియు ఇంటర్ మీడియట్ చదువుచూ అత్యుత్తమ ప్రతిభ కనబరచిన 17 మంది విద్యార్థులకు ప్రోత్సాహమిస్తూ బంగారు పథకాలు బహూకరించారు. పర్యావరణ రహిత సమాజ స్థాపనోద్దేశ్యముతో మానవాళి మనుగడకు  హాని కలుగచేయు ప్లాస్టిక్ సంచులను నిషేధించాలని విజ్ఞప్తి చేయుచూ జూట్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి నమశివాయ గారు అధ్యక్షత వహించగా సీల్వేల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బండారు సుబ్బారావు గారు ముఖ్య అతిథిగా కె.పి.సి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కె. అనిల్ కుమార్ గారు గౌరవ అతిథిగా విచ్ఛేశారు.  అనిల్ కుమార్ గారి పుట్టినరోజు కూడా అదే రోజైనందులకు  సమావేశంలో వారు బర్త్ డే  కేక్ కట్ చేయగా వారికందరు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో బండారు సుబ్బారావు, అనిల్ కుమార్, సలహాదారులు గుండా చంద్రమౌళి,  ప్రాజెక్ట్ చైర్మన్ డా.మారం లక్మయ్య, ప్రాజెక్ట్ కోఆర్డీడినేటర్ పల్లెర్ల రమేశ్ ఉపాధ్యక్షులు బైంసాని సత్యనారాయణ,  సంపత్ కుమార్, దేసు శ్రీనివాస్, గోపిశెట్టి అశోక్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతమొనర్చారు.



This is footer
కామెంట్‌లు