అవోపా కాగజనగర్ వారిచే పేపర్ బ్యాగుల పంపిణీ


తేదీ 1.1.2020 రోజున కొమురంభీం జిల్లాలోని కాగజ్నగర్ అంబెడ్కర్ చౌక్ లోని ఇందిరా మార్కెట్ లో ఆంగ్ల నూతన సంవత్సర దినోత్సవం 2020 సందర్భంగా అవోప కాగజ్నగర్ యూనిట్ సభ్యులు అవసరమైన వారికి పేపర్ బ్యాగులు పంపిణీ చేస్తూ పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ సంచులు వినియోగించవద్దని, ప్లాస్టిక్ రహిత జిల్లాగా/ప్రాంతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పేపర్ బ్యాగులు/సంచులు పంపిణీ చేయుచున్నామని ఇందులకు అందరూ సహాకరించి ప్లాస్టిక్ సంచుల వినియోగం మానివేయాలని అధ్యక్షుడు మల్లేశం, ప్రధాన కార్యదర్శి అశోక్, ఆర్థిక కార్యదర్శి దత్తాత్రేయ గారలు ప్రజలకు తెలియజేస్తూ కనువిప్పు కలుగజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ, రాకేష్, రమేశ్ బాబు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజోపయోగ కార్యం చేపట్టిన అవోపా కాగజనగర్ అధ్యక్ష కార్యదర్శులను తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందిస్తున్నవి.
 


కామెంట్‌లు