విద్యార్థులకు ఐఫా వారి ఆర్థిక సహాయం


తేదీ 25.1.2020 రోజున హైదరాబాద్ పంజాగుట్ట లోని వైస్ప్రొ వారి తోపాజ్ భవనంలో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారు ట్రస్ట్ అధ్యక్షుడు బెల్ది శ్రీధర్ గారి అధ్యక్షతన జరిపిన కార్యక్రమంలో వెంకటరమణ కాలనీ లోని సరస్వతీ విద్యా మందిర్లో చదువుచున్న ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆర్థిక సహాయం, ఉపకార వేతనాలు, పుస్తకాలు బ్యాగులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు బెల్ది శ్రీధర్, ప్రధాన కార్యదర్శి కొటేశ్వరరావు, మేనేజింగ్ ట్రస్టీ వాసా పాండు రంగయ్య, కోశాధికారి గోపాల్ గుప్త, ఫౌండర్ ట్రస్టీ  సభ్యులు డా.మారం లక్మయ్య, రాజకుమార్, నంబర్మళ్ళు, గురుమల్లు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు శ్రద్దాసక్తులతో కష్టపడి చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు, అవొపకు మంచి పేరు తేవాలని వారి బంగారు భవిష్యత్తుకు వారే బాటలేసుకోవలని అధ్యక్షుడు బెల్ది శ్రీధర్ ఉద్భోదించారు. 


కామెంట్‌లు