మహబూబ్నగర్ వాసవి ట్రస్టు ద్వారా విద్యార్థినీ విద్యార్థులకు ఎడ్యుకేషనల్ లోన్స్ అందజేత

తేదీ 22.12.2019 రోజున అవోపా ఎడ్యూకేషనల్ ట్రస్ట్ మహబూబ్నగర్ వారు స్థానిక సమావేశ మందిరంలో బీద  ఆర్య వైశ్య విద్యార్థులకు  ఉన్నత చదువులు చదవడానికి ఎడ్యుకేషనల్ లోన్స్ అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత వైశ్య ఫెడరేషన్ యాక్టింగ్ ప్రెసిడెంట్,  వాసవి హాస్పిటల్ చైర్మన్ మరియు ముషీరాబాద్ వైశ్య హాస్టల్ చైర్మన్ శ్రీ గంజి రాజమౌళి గుప్త గారు ముఖ్య అతిథిగా గంజి స్వరాజ్య బాబు తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు విశిష్ట అతిథిగా మరియు తెలంగాణ రాష్ట్ర అవోపా ఉపాధ్యక్షులు మాలిపెద్ది శంకర్, ప్రధాన కార్యదర్శి నిజాం వెంకటేశం, ఆర్థిక కార్యదర్శి చింతా బాలయ్య, కలకొండ సూర్యనారాయణ, కార్యదర్శి కొండూరు రాజయ్య మరియు వాసవి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ గుండ్ల కృష్ణయ్య హాజరయ్యారు. ముఖ్య అతిథి మాట్లాడుచూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇదొక్కటే ట్రస్ట్ విద్యార్థులకు ఎడ్యుకేషనల్ లోన్స్ ఇస్తున్నదని తెలుపుచూ  ఐ.ఏ.ఎస్ ప్రిలిమినరీ పాసైన ఆర్యవైశ్య విద్యార్థి ఎవరైనా ఉంటే వారికి తాను రు.ఒక లక్ష రూపాయల సహాయము చేయగలనని సంతోషంగా తెలియజేసినారు. ఈ సమావేశంలో ఎం.బి.బి.ఎస్ చదువుచున్న విద్యార్థులకు రు.50,000 ల చొప్పున, బి.టెక్ చదువుచున్న విద్యార్థులకు రు.25,000 ల చొప్పున మరియు పి.జి చదువుచున్న విద్యార్థులకు రు.20,000 ల చొప్పున మొత్తము రు.11,15,000 ల ఎడ్యుకేషనల్ లోన్స్ ఇవ్వడము జరిగినది. ఇంత చక్కని కార్యక్రమము చేసిన మహబూబ్నగర్ వాసవి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారికి, ఆర్థిక సహాయము పొందిన ఆర్య వైశ్య విద్యార్థులకు  తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెలుపుచున్నవి.




కామెంట్‌లు