అమెరికా తెలుగు అసోసియేషన్ వారి పురస్కారం


అవోపా హన్మకొండ విద్యాకమీటి చైర్మన్, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, కృష్ణ కాలనీ , వరంగల్ లో ప్రిన్సిపాల్ గా పని చేస్తున్న శ్రీ గంపా అశోక్ కుమార్ గారు, ఆదివారం సాయంత్రం రవీంద్ర భారతీ లో "అమెరికా తెలుగు అసోసియేషన్" (ఆటా) వారు "ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలు" అను అంశం పై నిర్వహించిన సదస్సులో పాల్గొని ప్రసంగించగా, అత్యుత్తమ సేవలను అందిస్తూ, పాఠశాల అబివృద్దికి కృషి చేస్తున్నందులకు మరియు మరెన్నో సామాజిక కార్యక్రమాలలో సేవలందిస్తున్నందులకు మరియు వివిధ స్వచ్చంద సంస్థల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పెంపు మరియు వారికి కనీస సౌకర్యాలు కల్పిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నందుకు వీరికి ఆటా చైర్మన్ పరమేష్ పురస్కారాన్ని ప్రధానం చేశారు.   వాసవీమాత దయవలన వీరు సమాజానికి మరెంతో సేవచేయలని, మరెన్నో అవార్డులను అందుకోవాలని అవోపా హనుమకొండ అధ్యక్షుడు ఎల్లంకి రవీందర్ గారు, తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభిలషిస్తున్నారుకామెంట్‌లు