ఆర్యవైశ్య ఇండస్ట్రీయల్ ఫోరమ్ కన్వెన్షన్


ఆర్యవైశ్య ఇండస్ట్రియలిస్ట్ ఫోరమ్ వారు ఆన్యువల్ కన్వెన్షన్ 2019 ని సికింద్రాబాద్ లోని క్లాసిక్ గార్డెన్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రియల్ ఎక్సిబిషన్ ప్రారంభం, సావనిర్, డైరెక్టరీ విడుదల మరియు పెరెన్నికగన్న 11 మంది ఆర్యవైశ్య డోఎన్స్ లను సన్మానించుట మొదలగునవి అతి వైభవంగా నిర్వహించారు. సన్మాన గ్రహితల్లో సర్వాశ్రీ బచ్చుఁ చిన వెంకట సుబ్బారావు, బండారు సుబ్బారావు, గుబ్బా నాగేందర్, గౌర శ్రీనివాస్, డా.పబ్బతి వి.మోహనరావు, మంచుకొండ ప్రకాశం, మాడుపల్లి మోహన్ గుప్త,  రణ్వీర్ ప్రొద్దుటూరి, సుధాకర్ గందే, ఎర్రం విజయకుమార్ మరియు గజ్జల యోగానంద్ గారలున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ.టి.జి.వెంకటేశ్ గారు విశిష్ట అతిథులుగా నిజామాబాద్ శాసనసభ సభ్యుడు శ్రీ బిగాల గణేష్ గుప్త గారు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి  దామోదర్ గారు మరియు, అవోపా హైదరాబాద్ అధ్యక్షుడు నమశివాయ, ఆర్థిక కార్యదర్శి మాకం భద్రినాథ్, అవోపా పూర్వధ్యక్షుడు పి.ఎస్.ఆర్. మూర్తి, అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ అధ్యక్షుడు పి.వి. రమణయ్య, విజయ్ గుప్త తదితరులు సుమారు 700 మంది వరకు పాల్గొన్నారు. ఈ  కన్వెన్షన్ గొండ్రాల నాగేంద్ర గారి ఆధ్వర్యంలో ఫోరమ్ చైర్మన్ గుంతా శ్రీనివాసులు గారి కనుసన్నల్లో కార్యదర్శి దేవతర్రామ కుమార్ మరియు ఆర్థిక కార్యదర్శి వేలూరు కిశోర్ గుప్త గారల ఆక్టివ్ పార్టీసీపేషన్ తో సంపన్న మైనదని మరియు ఆహూతులకు చక్కని స్నాక్స్ తో సహా షడ్రతోపెతమైన విందునిఛ్చారని తెలియజేసారు. ఇంత చక్కని కార్యక్రమము చేసిన ఇండస్ట్రియల్ ఫోరమ్ అధ్యక్ష కార్యదర్శులను తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము ఎడిటర్ నూకా యాదగిరి అభినందిస్తున్నారు. 


 


కామెంట్‌లు