నూతన ఉద్యోగ ప్రవేశ అభినందనలు

తెలంగాణ రాష్ట్ర వనపర్తి లోని వల్లభ్ నగర్ వాస్తవ్యుడు పి.నరేందర్ బాబు కుమారుడు, కార్తీక్ తెలియజేయు చున్నదేమనగా అతికష్టం పై గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాననీ, ఆర్థిక ఇబ్బందితో పై చదువులు చదువలేక, పెద్దవారైన తల్లిదండ్రుల మరియు స్వీయ పోషనార్థమై ఉద్యోగాన్వేషణ చేస్తూ పలు ఇంటర్వ్యూలకు హాజరై సకల ప్రయత్నాలు చేశాననీ, కానీ ఒక చిన్న ఉద్యోగము సైతము సంపాదించలేక బాధ పడుచున్న వేళ, శ్రేయోభిలాషుల సలహాపై శ్రీ అవోపా వనపర్తి జిల్లా అధ్యక్షుడు శ్రీ. ఎం.ఎన్.రాజకుమార్ గారిని కలిశానని, తన పరిస్థితిని వివరించానని, అతను రాష్ట్ర అవోపా నాయకులను సంప్రదించి తనకు నెల్సన్ కంపెనీలో రు.15000ల నెలసరి వేతనంపై ఉద్యోగం ఇప్పించారని తెలియజేస్తూ ఈ విధంగా తనకు తన కుటుంబానికి బ్రతుకుదెరువు కల్పించిన శ్రీ ఎం.ఎన్. రాజకుమార్ గారికి, ఉద్యోగం రావడానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు గంజి స్వరాజ్యబాబు గారికి, అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూకా యాదగిరి గారికి, టి.సుధాకర్ రెడ్డి మొదలగు వారందరికి సదా రుణపడి ఉంటానని లబ్దిదారుడు కార్తీక్ ఒక కృతజ్ఞతా పత్రములోతెలియజేయు చున్నాడు. నూతనంగా ఉద్యోగంలో ప్రవేశించిన కార్తీక్ తన ఉద్యోగంలో  నిష్టాగరిష్టలతో, శ్రధ్ధాసక్తులతో, వినయ విధేయతలతో, పని జేస్తూ తన ఉద్యోగంలో కృతకృత్యుడవ్వాలనీ, ఉద్యోగంఇప్పించిన అందరికీ మంచి పేరు తేవాలని, తను కూడా ఇతరులకు సహాయ పడాలనీ ఉద్భోదిస్తూ ఉద్యోగార్థి కార్తీక్ కు మఱియొకమారు నూతన ఉద్యోగ ప్రవేశ శుభాకాంక్షలు అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూకా యాదగిరి మరియు తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్ష కార్యదర్శులు గంజి స్వరాజ్యబాబు గారు, నిజాం వెంకటేశం మరియు వారి కమిటీ సభ్యులు తెలియజేయుచున్నారు.


కామెంట్‌లు