సైనిక దళాల సంక్షేమ నిధికి విరాళం

మట్టపల్లి వృధ్ధాశ్రమంలో నివసించు 78 ఏళ్ళ  సిరిపురం విశ్వనాధం గుప్తా గారు తాను సంపాదించిన 50 లక్షల రూపాయలను భారతదేశ సైనిక సంక్షేమ నిధికి విరాళంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై గారికి అందజేశారు. గవర్నరు గారు వీరి ఉన్నత భావాలను ప్రశంసించి వీరిని శాలువాతో సత్కరించారు. సైనిక సంక్షేమాధికారి వీరి భూరి విరాళం ఎందరికో స్ఫూర్తి నివ్వాలని అభిలషించారు. కామెంట్‌లు