ఆర్దిక సహాయం

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం వనపర్తి నందు వాసవి భవన్ ఇన్చార్జిగా పనిచేయుచున్న శ్రీనివాసులు గారి అబ్బాయి నగేష్ కు పాలిటెక్నిక్ చదువు పూర్తి చేయుటకు రు.18 వేలు మరియు బి.టెక్ ప్రవేశ ఖర్చులకు 5000 ఆర్థిక సహాయము స్థానిక క్లాస్మేట్ క్లబ్ వ్యవస్థాపకులు నాగర్ కర్నూల్ వాస్తవ్యులు రాఘవేందర్ గారిచే మరియు కాశి అన్నపూర్ణ సత్రం మేనేజ్మెంట్ వారిచే బి.టెక్ చదువుటకు ప్రతి సంవత్సరం 70000 ల రుణ సహాయం వనపర్తి జిల్లా అవోపా అధ్యక్షుడు శ్రీ రాజ్ కుమార్ గారు చేపించినారు. కావున పై వారికి మరియు వీరయ్య గుప్త వనపర్తి గార్లకు తన హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేయమని శ్రీనివాసులు కోరినందున, ఆర్థిక సహాయం మరియు రుణ వసతి కల్పించి విద్యార్థి చదువు నిరాటంకంగా కొనసాగించుటకు సహకరించిన ఎం.ఎన్ రాజ్ కుమార్ గారికి మరియు దాతలకు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గం అభినందనలు తెలియ జేయుచున్నవి.


కామెంట్‌లు