అవోపా హైదరాబాద్ వారి మెగా హెల్త్ క్యాంపు

తేదీ 3.11.2019 రోజున బేగంపేట్ లోని 'విన్' హాస్పిటల్ లో అవోపా హైదరాబాద్ మరియు 'విన్' హాస్పిటల్ యాజమాన్యం సంయుక్తంగా నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్ విజయవంతంగా ముగిసింది. ఈ మెగా హెల్త్ క్యాంప్ కు సుమారు 252 మంది విచ్ఛేసి ఆరోగ్య పరీక్షలు చేపించుకున్నారు. ఈ సందర్భంగా మంజీర కాంగ్లామరేటివ్ సి.ఎం.డి శ్రీ గజ్జల యోగానంద్ గారు మాట్లాడుచూ ఇలాంటి ఆరోగ్య పరీక్షలు తరచూ చేపించు కొనడం వలన ఆరోగ్య పరిస్థితి తెలుస్తుందని ఇవి రోగ నిర్ధారణకు ఎంతగానో ఉపయోగ పడుతాయని అన్నారు. ఆరోగ్యం కాపాడుకోడానికి సభ్యులు స్వచ్ఛ భారత్ ప్లాస్టిక్ నిషేధం లాంటి ఉపయుక్తమైన కార్యక్రమాలు చేయాలన్నారు. సంప్రదాయ బధ్ధమైన ఆహారం తీసుకోవడం కూడా ఆరోగ్య పరిరక్షణకు ఉపకరిస్తుందన్నారు. విన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వివేక్ గారు మాట్లాడుచూ తాము ఇలాంటి సేవా కార్యాక్రమాలు ఎప్పడినుండో చేయుచున్నామని, ఇందులో రు.9999ల విలువ గల 170 పరీక్షలు కేవలం రు.999 లకే చేయుచున్నామని తదుపరి రోగ నిర్ధారణకు కూడా సంబంధిత స్పెషలిస్ట్ డాక్టర్లను ఏర్పాట్లు చేశామని వారు ఈ పరీక్షల ఆధారంగా రోగ నిర్ధారణ చేసి మందులు వ్రాస్తారని మరియు అవసరమైతే తదుపరి పరీక్షలు చేపించుకోడానికి కూడా సలహాలిస్తారని అందులకు అయ్యే ఖర్చులపై కూడా 50% రాయితితో సేవాలందిస్తామని అన్నారు. తదుపరి అవోపా హైదరాబాద్ అధ్యక్షుడు నమశివాయ గారు మాట్లాడుచూ ఈ రోజు మా మెగా హెల్త్ క్యాంపు ప్రకటనకు స్పందించి 252 మంది వచ్చారని ఇదే హెల్త్ క్యాంపును ఇదే నేలలో 9 మరియు 10వ తారీఖులలో కూడా నిర్వహిస్తామని ఆసక్తి కలవారు అవోపా హైదరాబాద్ కార్యాలయంలోని దయానంద్ గారిని వారి ఫోన్ నంబర్ 9246186865 తో సంప్రదించి వారి పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. కావున అవోపా సభ్యులు ఎక్కువ మంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనీ, 17.11.2019 తేదీన నిర్వహించు కార్తీక వనసమారాధన కార్యక్రమానికి ఎక్కువ మంది రావాలని, ఆరోజు జూట్ బ్యాగులు పంపిణీ చేస్తూ, ప్లాస్టిక్ నిషేధనా కార్యక్రమానికి శ్రీకారం చుట్టి తమవంతు కృషి చేస్తామని, ప్రతి సంవత్సరము ఇలాంటి మెగా హెల్త్ క్యాంపులు, యోగా శిబిరాలు, మొక్కలు నాటడం, సీడ్ బాల్స్ పంపిణీ చేయడం, బీద విద్యార్థులకు స్కాలర్షిప్పులు పంపిణీ చేయడం మరియు అవగాహణా సదస్సులు, విహార యాత్రలు నిర్వహించడం లాంటి అనేక కార్యక్రమాలు చేపడతామని అన్నారు. పిదప 'విన్' హాస్పిటల్ డాక్టర్లను ఉచిత రీతిన సన్మానించారు. ఈ కార్యక్రమంలో అవోపా హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, కోశాధికారి మాకం భద్రినాథ్, సంస్థ పూర్వాధ్యక్షులు బిగినేపల్లి చక్రపాణి, ఉపాధ్యక్షులు సత్యనారాయణ, సంపత్, హాస్పిటల్ డైరెక్టర్ శ్రీ కూర నాగరాజు మరియు తెలంగాణ రాష్ట్ర  అవోపా తరఫున సంస్థ ప్రధాన కార్యదర్శి శ్రీ నిజాం  వెంకటేశం గారు  పాల్గొని కర్యక్రమమంతా కాచం సత్యనారాయణ గారి సౌజన్యంతో వీడియో తీపించారు, వారికి కృతజ్ఞతలు తెలిపి, అవోప హైదరబాదు వారికి అభినందనలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో  శ్రీ బాదాం కృష్ణారావు, బిజ్జాల రమేష్, బచ్చుఁ వేద ప్రకాష్, రాజేశ్వర రావు, హరనాథ్ మరియు అవోపా హైదరాబాద్ సీనియర్ మెంబర్స్ కూడా పాల్గొన్నారు. 


 కామెంట్‌లు