కార్తీక మాసంలో అవోపా హైదరాబాద్ వారు తేదీ 17 నవంబర్ 2019, ఆదివారం రోజున కార్తిక వనభోజన కార్యక్రమాన్ని సైదాబాద్ లోని శ్రీ కోదండ రామాలయం లో జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్ఛేసిన నిలోఫర్ కేఫ్ యజమాని అనుముల బాబూరావు కార్తీక మాస విశిష్టతను తెలియజేసారు. పిల్లలకు ఆచార వ్యవహారాలు తెలియజేయడంలో అవోపా ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అల్పాహారం తర్వాత ఉసిరిచెట్టు పూజ, గోపూజ, ఆటపాటల అనంతరము మధ్యాహ్న భోజన కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం ఆటల పోటీల కార్యక్రమము తర్వాత వాసవి మాత ప్రార్థనా పోటీలు కవిరత్న శ్రీ చింతల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరిపి అందులో గెలుపొందిన శ్రీమతి బచ్చు పద్మ, శ్రీమతి రాజ్యలక్ష్మి మరియు శ్రీ వెంకటాచలం గారలకు ప్రథమ ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా 80 రంగారెడ్డి జిల్లా స్థాయి పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాస, వకృత్వ పోటీలలో విజేతలకు బహుమతుల ప్రధానం గావించారు. ఈ వనభోజన కార్యక్రమానికి విన్ హాస్పిటల్ ఎం.డి వినాయక్, వేముల శ్రీనివాసులు, పంపాటి వినాయక్, అవోపా హైదరాబాద్ అధ్యక్షుడు నమశివాయ, ప్రధాన కార్యదర్శి రవిగుప్త, కోశాధికారి మాకం భద్రినాథ్, చీఫ్ ఎడిటర్ కూర చిదంబరం మరియు 300 మంది కి పైగా అవోపా సభ్యులు హాజరై ఉల్లాసంగా గడిపారు. సాయంత్రం స్నాక్స్ టీ సేవించిన తర్వాత మధుర స్మృతులను మననం చేసుకుంటూ గృహోన్ముఖులైనారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం గా నిర్వహించిన అవోపా హైదరాబాద్ అధ్యక్షుడు నమశివాయను అతని కార్యవర్గాన్ని ప్రాజెక్ట్ చైర్మన్ సంపత్కుమార్ గారిని పలువురు ప్రశంసించారు.
కార్తీక వన సమారాధనా కార్యక్రమము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి