అవోపా కరపత్రాన్ని ఆవిష్కరించిన వరంగల్ మేయర్


 ఆర్యవైశ్య ప్రతిభావంతులైన విద్యార్థులకు బంగారు పతకాలను అందించడానికి సంబంధించి అవోపా వారు ముద్రించిన కరపత్రాన్ని మేయర్ గుండా  ప్రకాశ్ రావు సోమవారం వరంగల్ మునిసిపాలిటీ మేయర్ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించి 2018-19 విద్యాసంవత్సరంలో వివిధ కోర్సులలో విద్య నభ్యసించిన ఆర్యవైశ్య విద్యార్థినీ విద్యార్థులు ఈ నెల 24 ఆదివారం లోగా అవోపా హన్మకొండ సుబేదారి కార్యాలయంలో దరఖాస్తు తీసుకొని పూర్తివివరాలతో పూర్తి చేసి సమర్పించాలని కోరారు. అవోపా వారు ఇలాంటి కార్యక్రమాలను ప్రతిఏటా నిర్వహిస్తూ విద్యార్థిని విద్యార్థుల్లో పోటీ వాతావరణాన్ని నెలకొల్పడం శుభపరిణామం అన్నారు.  ఈ సందర్భంగా అవోపా అధ్యక్షులు మాట్లాడుతూ పూర్తి వివరాలకు 9849828952 / 9390102029 నంబర్ల యందు సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు ఎల్లంకి రవీందర్  విద్యాకమిటీ చైర్మన్ గంప అశోక్ కుమార్, తాటిపల్లి  లింగమూర్తి చౌడారపు రాజశేఖర్  తదిరులు పాల్గొన్నారు


కామెంట్‌లు