అవోపా హబ్సిగూడ వారి కార్తీక వన మహోత్సవాలు


తేదీ 17.11.2019 రోజున హైదరాబాద్ లోని సరూర్ నగర్ లేక్ దగ్గరి పెద్దతోట లోని భూలక్ష్మి మాత ఆలయంలో అవోపా హబ్సిగూడ వారు కార్తీక వన మహోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉసిరిచెట్టు కు పూజ, అనంతరం జరిగిన  సమావేశం లో నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించి పిదప భోజనానంతరం మధ్యాహ్నము ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతుల ప్రదానం గావించారు. ఈ సారి వినూత్నంగా  సమావేశానికి సరైన సమయంలో హాజరైన ముగ్గురు జంటలకు, ఒక వెల్డ్రెస్సెడ్ జంటకు, ఒక క్యూట్ చిల్డ్రన్కు, ఇద్దరు లక్కీ మెంబర్స్ కు బహుమతులందజేశారు. ఈ సమావేశానికి జి. లక్ష్మీనారాయణ గారు కె.సదానందం గుప్త గారు లంచ్ స్పాన్సర్ చేశారు. సాయంత్రం టీ స్నాక్స్ తరువాత రోజంతా ఉల్లాసంగా గడిపిన మధుర క్షణాలను మననం చేసుకుంటూ గృహోన్ముఖులైనారు.  నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్ష కార్యదర్శులకు, కమిటీకి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభినందనలు తెలియబరచుచున్నవి.కామెంట్‌లు