అవోపా లక్షెట్టిపెట్ గాంధీ జయంతి వేడుకలు


తేదీ 2.10.2019 రోజున అవోపా లక్షెట్టిపెట్ వారు గాంధీ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. వారు గాంధీజీ మరియు వాసవిమాత చిత్ర పటాలకు పూలమాలలువేసి గాంధీజీ సూక్తులు పాటిస్తామని, ఆశయాలను నెరవేరుస్తామని ప్రతినబూనారు. ఆవోపా ఆధ్వర్యములో ఘనంగా నిర్వహించిన 150 వ గాంధీ జయంతి సందర్భముగా గాంధీ చౌక్ లో గల గాంధీ విగ్రహమునకు పూల మాలంకారణ గావించి నివాళులు అర్పించారు .అనంతరము ప్రభుత్వ హస్పిటల్ లో పండ్లూ బ్రేడ్స్ రోగులకు పంచి పెట్టారు ఆనంతరం మండలం లోని విద్యార్ధులకు గాంధీ గురించీ ఉపన్యాస పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికీ బహుమతులు ఇచ్చారు ఈ ప్రోగ్రామ్స్ లో ఆవోపా జిల్లా అధ్యక్షుడు గుండ సత్యనారాయణ అవోపా టౌన్ అద్యక్షుడు పాలకుర్తి సుదర్శన్ నాయకులు రాచర్ల సత్యనారాయణ k.కేకిషన్ కొత్త సురేష్ అక్క నపెల్లి కోటయ్య గుండ సంతోశ్ గౌరిచేట్టి సంతోష్ బొదుకూరి సత్తయ్య ch.శంకర్ .గంప రవీందర్ తది తరులు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.


 


కామెంట్‌లు