బి.టెక్ విద్యార్థినికి ఆర్ధిక సహాయం


నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి కి చెందిన సౌజన్య  బి.టెక్ చదువును కొనసాగించడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుచున్న సందర్భంలో జిల్లా అవొప తరుపున ఆమెకు రు.5000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోల శ్రీధర్ మాట్లాడుతూ నిరుపేద ఆర్యవైశ్య విద్యార్థులకు అవొప ఎల్లప్పుడూ అండగా ఉంటుందని,  బి.టెక్ చదువును కొనసాగించడానికి ఆర్ధికంగా ఇబ్బంది పడుచున్న సౌజన్య కు ఆర్థిక సహాయం చెయ్యడం ఆనందంగా ఉందని కల్వకుర్తి అవొప అధ్యక్షుడు ఎలిశెట్టి కృష్ణయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్థిక కార్యదర్శి బిళ్ళకంటి రవికుమార్, శోభన్, నరసింహస్వామి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు