శత గురువుల సన్మాణం


తేదీ 29.9.2019 రోజున జగిత్యాలలోని వాసవి గార్డెన్స్ లో వాసవి ట్రస్ట్ వారు శత గురువులను సన్మానించు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అవోపా తరపున ప్రధాన కార్యదర్శి నిజాం వెంకటేశం గారు హాజరైనారు. ఈ కార్యక్రమానికి హాజరైన జగిత్యాల శాసనసభ సభ్యుడు డా.సంజయ్ కుమార్ మరియు పట్టభద్రుల కౌన్సిల్ సభ సభ్యుడు జీవన్ రెడ్డి గారలు మాట్లాడుచూ సమాజానికి మార్గదర్శకులు ఉపాధ్యాయులని వారి వల్లే ఉన్నత విద్యావంతులు సమాజాభువృద్ధికి తోడ్పడుచున్నారని సమాజంలో వారి స్తానం ఎంత పవిత్ర మైనదో వారు తెలియజేసారు. ఈ కార్యక్రమానికి ఐ.వి.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త, టీంబర్ మర్చంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చకిలం రమణయ్య, బుస్సా శ్రీనివాస్ బచ్చు శ్రీనివాస్ తదితరులు హాజరైనారు. 


కామెంట్‌లు