అవోపా హనుమకొండ కార్యవర్గ సమావేశము

తేదీ 20.10.2019 రోజున  అవోపా భవన్‌లో జరిగిన అవోపా హనుమకొండ కార్యవర్గ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర అవోపా చీఫ్ కో-ఆర్డినేటర్ శ్రీ గుండా చంద్రమౌలి పరిశీలకుడిగా హాజరయ్యారు. అవోపా హనుమకొండ గత 35 సంవత్సరాల నుండి విశిష్ట సేవాలందిస్తోందని, 3 కోట్ల విలువైన సొంత భవనమును కలిగి ఉందని, ఇంజనీర్లు, వైద్యులు, ప్రొఫెసర్లు, ఉన్నత మేధావులు మరియు వివిధ వర్గాల నిపుణుల సభ్యత్వం కలిగి ఉందని, ఈ సమావేశంలో యూనిట్ అవోపాస్, డిస్ట్రిక్ట్ అవోపాస్ & స్టేట్ అవోపా యొక్క ఫైనాన్షియల్ డిసిప్లిన్, అడ్మినిస్ట్రేషన్ & ఎలక్షన్స్ గురించి చర్చించా మని, ఇప్పటివరకు 54 మంది బంగారు పతక ధర్మకర్తలుండగా మరియొక 6 మంది తలా రు.11116 చెల్లించ నున్నారని అపుడు ఈ సంఖ్య 60కి చేరనుందని, అలా వసూలైన మొత్తము రు.6,66,900లు బ్యాంకులో ఫిక్సడ్ డిపాజిట్ చేసి దానిపై ప్రతి సంవత్సరం వచ్చుఁ వడ్డీపై ప్రతి ఏటా బంగారు పథకాలు ఇచ్చుటకు తీర్మానించామని అవోపా హనుమకొండ అధ్యక్షుడు ఎల్లంకి రవీందర్ గారు తెలియజేసారు. ఈ సమావేశంలో అక్కడికక్కడే డాక్టర్ రాధాకృష్ణ రూ.11116 /- లు బంగారు పథక ధర్మకర్తగా చెల్లించారు.  ఈ సమావేశంలో అవోపా  హనుమకొండ వ్యవస్థాపక అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర అవోపా సాంకేతిక సలహాదారు శ్రీ మునిగేటి సత్యనారాయణ గారు, వ్యవస్థాపక కార్యదర్శి మరియు తెలంగాణ రాష్ట్ర అవోపా ప్రధాన సలహాదారు శ్రీ పోకల చందర్ గారు, అవోపా హనుమకొండ   ప్రధాన కార్యదర్శి ప్రకాశం గారు, ఆర్థిక కార్యదర్శి అప్పారావు గారు, జిల్లా అవోపా అధ్యక్షుడు రమణయ్య, నాగభూషణం, శశిధర్, రామారావు, శ్రీనివాసరావు శివకుమార్ దంపతులు తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.కామెంట్‌లు