ఉత్తమ గ్రామ సర్పంచ్ అవార్డ్


తెలంగాణ రాష్ట్ర అవోపా ముఖ్య సలహాదారు శ్రీ పోకల చందర్ సోదరుడు శ్రీ పోకల శివకుమార్ గారు జనగామ జిల్లా రఘునాథపల్లి గ్రామ సర్పంచ్ గా పనిచేయు చున్నారు. వారు ఇటీవల భారత దేశంలోనే 15 వ ఉత్తమ సర్పంచి గా ఎంపికైనందున వారిని తెలంగాణ రాష్ట్ర   అవోపా ముఖ్య సలహాదారు  మరియు లయన్స్ మాజీ గవర్నర్ శ్రీ పోకల చందర్ గారు, సాంకేతిక సలహాదారు  మరియు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ మాజీ డైరెక్టర్ శ్రీ మునుగోటి సత్యనారాయణ మరియు తెలంగాణ రాష్ట్ర అవోపా చీఫ్ కో ఆర్డినటర్ గుండా  చంద్రమౌళి గార్లు పోకల శివకుమార్ గారిని సన్మానించి, అభినందించారు, మున్ముందు అత్యున్నత పదవులతో రాణించాలని కోరారు. వారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభినందనలు తెలుపు చున్నవి.


కామెంట్‌లు