అవోపా కామారెడ్డి గాంధీ జయంతి వేడుకలు


మహాత్మాగాంధీ 150 వా జన్మదిన సందర్భంగా  అవోపా కామారెడ్డి ఆధ్వర్యంలో గాంధీ గంజ్ మరియు దేవునిప‌ల్లిలో ఉన్న గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా జ‌యంతి ఉత్స‌వాలు నిర్వ‌హించ‌డం జరిగింది. ఈ సందర్భంగా సమాజంలో ప్రతి ఒక్కరూ గాంధీజీ ఆయుధాలు అయిన సత్యం అహింసలను శక్తివంచన లేకుండా పాటించాలని అవోపా కామారెడ్డి తరఫున అధ్యక్షులు ఉప్పలపు సంతోష్ కుమార్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఆర్థిక కార్యదర్శి గంగా ప్రసాద్ మరియు కార్యవర్గ సభ్యులు కోరడమైనది. తదుపరి ప్లాస్టిక్ రహిత సమాజం కొరకు పాటుపడుతామని ప్రతిన బూనారు.


కామెంట్‌లు