అవోపా సిరిసిల్ల వారి బంగారు పథకాల అందజేత

తేదీ 10.10.2019 రోజున అవొపా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ఎల్లంకి శ్రీనివాస్ అధ్యక్షతన ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరిగింది. ఇందులో రాజన్న సిరిసిల్ల జిల్లా లోని 13 మండలాలకు చెందిన ఎస్.ఎస్.సి, ఇంటర్, ఎంసెట్ పరీక్షలలో మంచి ప్రతిభ కనబరిచిన 46 మంది ఆర్యవైశ్య విద్యార్థులకు బంగారు పథకాలు, వివిధ కోర్సులలో మంచి ప్రతిభ కనబరిచిన వారిని సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు గంజి స్వరాజ్యబాబు, ప్రదాన కార్యదర్శి నిజం వెంకటేశం, రాజన్న సిరిసిల్ల అవోపా ప్రధాన కార్యదర్శి బచ్చు అశోక్, కటకం సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. 

కామెంట్‌లు