కల్వకుర్తి అవోపా ఎన్నికలు


తేదీ 15.9.2019 రోజున నాగర్ కర్నూలు జిల్లా లోని కల్వకుర్తి అవొప యూనిట్ కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవవం ఆదివారం కల్వకుర్తిలోని కన్యక పరమేశ్వరి కల్యాణ మంటపం లో జరిగింది.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర అవోపా ఉపాధ్యక్షుడు నాగర్ కర్నూల్ జిల్లా అవోపా అధ్యక్షుడు పోలశ్రీధర్ మాట్లాడుచూ కల్వకుర్తి అవొప గత 20 సంవత్సరాల నుండి సేవ రంగంలో ముందుందని   ప్రశంసిస్తూ విద్యానిది ఏర్పాటు చేసి ఎక్కువ మంది పేద ఆర్యవైశ్యులకు సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి అవోపా సభ్యులు మాజీ కార్యవర్గ సభ్యులు పుర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంత మొనర్చారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు ఎలశెట్టి కృష్ణయ్యకు, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లుకు మరియు ఆర్థిక కార్యదర్శి జంగయ్య కు తెలంగాణ రాష్ట్ర అవోపా కార్యవర్గము మరియు అవోపా బులెటిన్ సంపాదక వర్గము అభినందనలు తెలియ జేయుచున్నవి.


కామెంట్‌లు