This is header
ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు


తేదీ 5.9.2019 ఉపాధ్యాయ దినోత్సవం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశేష సేవలందించిన ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి పురస్కార ప్రదానం గావించారు.  ఆంధ్రప్రదేశ్ అవోపాలో కీలక పదవి నలంకరించిన చలపతిరావు గారి కోడలు డా. కాంచనలత చిట్టూరి ఇందిరా ప్రియదర్శిని కళాశాలలో భౌతిక శాస్త్ర ఉప-ఆచార్యుణి గా పనిచేస్తున్నందున వారిని ఉత్తమ ఉపాధ్యాయిని గా ఎంపికచేసి తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖా మాత్యులు శ్రీ జగదీశ్ రెడ్డి చేతుల మీదుగా పురస్కారం అందించారు. ఈవిడ ఎం.ఎస్.సి న్యూక్లియర్ ఫిజిక్స్ లో గోల్డెమెడలిస్ట్ మరియు ఎం.పిల్, పి.హెచ్.డి కూడా చేశారు. వీరిని తెలంగాణ అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గం అభినందిస్తున్నవి. 


This is footer
కామెంట్‌లు