ఉచిత ఆరోగ్య శిబిరం

 


 


 తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు సంరక్ష హాస్పిటల్ సంయుక్తంగా ఉచిత ఆరోగ్య శిబిరాన్ని అలగురి రంగంపేట్ లో తేదీ 15.9.2019 ఆదివారం రోజున నిర్వహించారు. ఈ కార్య క్రమము తెలంగాణ రాష్ట్ర అవోపా ఆరోగ్య కమిటీ అధ్యక్షుడు డా.గుండా రవీందర్ గారి  నేతృత్వంలో నిర్వహించారు. ఈ ఆరోగ్య శిబిరంలో డా.గ్యానేశ్వర్ గారు కూడా పాల్గొని తన సేవలందించారు. చుట్టు ప్రక్కల గ్రామాలనుంచి చాలా మంది మహిళలు, పెద్దలు పిల్లలు పెద్ద సంఖ్యలో హాజరై ఆరోగ్య పరీక్షలు చేపించుకున్నారని డా.రవీందర్ గారు తెలియబరచారు. ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించిన డా.రవీందర్ కు మరియు సహకరించిన డా. జ్ఞానేశ్వర్ కు సంరక్ష హాస్పిటల్ యాజమాన్యానికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెలుపుచున్నవి.


కామెంట్‌లు