ఆరోగ్య శిబిరం


150 వ మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాల సందర్భంగా కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ,  ఆర్యవైశ్య యువజన సంఘం మరియు శ్రీకర హాస్పిటల్ వారల సౌజన్యముతో తేదీ 26.9.2019 రోజున ఉచిత ఆరోగ్య శిబిరం ను సిరిసిల్ల రోడ్ లోని క్లాసిక్ గోల్డ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించుచున్నారు. ఈ ఆరోగ్య శిబిరానికి డాక్టర్ అఖిల్ డాడీ ఎం.ఎస్ (ఆర్థో)చీఫ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ వారు విచ్చేయు చున్నారు. కావున ఇట్టి అవకాశాన్ని సద్వినియోగ పరచుకుని  సర్వ మతాలవారందరు తమ తమ ఆరోగ్య పరీక్షలను ఉచితంగా చేపించుకోగలరు. ఇట్టి మహత్కార్యానికి తగు సహాయ సహకారాలు అందించి దిగ్విజయ మొనరించ వలసినదిగా అవోపా కామారెడ్డి వారిని కోరుచూ ఈ ఆరోగ్య శిభిరం విజయవంతమవ్వాలని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభిలషిస్తున్నవి.


కామెంట్‌లు