ఉపాధ్యాయుడికి విద్యా సేవా భారతి జాతీయ పురస్కారం


హైదరాబాద్ కు చెందిన శిఖరం ఆర్ట్స్ సంస్థ 73 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అవోపా హుజురాబాద్ పూర్వాధ్యక్షుడు మండలం లోని రాజపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెనిశెట్టి రవికుమార్ కు విద్యా రంగంలొ చేస్తున్న కృషిని గుర్తించి జాతీయ సేవా భారతి పురస్కారాన్ని తేదీ 19-9-2019 సొమవారం రాత్రి ఢిల్లీ లోని లోదిరోడ్ లోకమంచ్ ఆడిటోరియం లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ పి.ఎస్.నారాయణ చేతుల మీదుగా డిప్యూటీ ఎన్ఫోర్స్ మెంట్ ఆఫీసర్ ఆదినారాయణ,  శిఖరం ఆర్ట్స్ ఫౌండర్ కృష్ణల సమక్షంలో ప్రదానం చేశారు.  జాతీయ స్థాయి అవార్డ్ పొందడం పట్ల హైదరాబాద్ కు చెందిన డాక్టర్ శ్రీమతి కొత్త కృష్ణవేణి , హుజురాబాద్ ఆవోపా మండల, జిల్లా అధ్యక్షులు వారి కార్య వర్గంతో పాటు సర్పంచ్ చింత సరిత పాటశాల చైర్మన్ మునిగాల పోచయ్య ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు. సేవా భారతి పురస్కార గ్రహీత వెనిశెట్టి రవికుమార్ గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్ష కార్యవర్గం మరియు అవోపా బులెటిన్ సంపాదక వర్గము అభినందనలు తెలియజేయి చున్నవి.


కామెంట్‌లు