ఉచిత వైద్య శిబిరO

తేదీ 11.7.2019 రోజున వనపర్తి జిల్లా విపనగండ్ల  మండల పరిధిలోని కాల్వరాల గ్రామంలో త్రినేత్ర ఈ.ఎన్.టి ఆస్పత్రిలో అవోపా విపనగండ్ల మరియు వాసవి క్లబ్ వారు సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ పి. రఘునాథ్ రెడ్డి ప్రారంభించగా డా. దివ్యతేజ కంటి వైద్యురాలు, డా.సుధీంద్ర ఇ.ఎన్.టి వైద్యుడు సేవలందించారు. ఈ కార్యక్రమములో ఆవోప వీపనగండ్ల  ఆధ్యక్షులు వి.సుబ్రమణ్యం గారు మరియు సి.సాయి శంకర్ వారి కమిటి సభ్యులు పాల్గొన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పరీక్షలు చేపించుకున్నారని అర్హులకు మందులు కూడా ఉచితంగా ఇచ్చామని అవోపా అధ్యక్ష కార్యదర్శులు తెలిపినారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఇతర అవొపాలు తెలంగాణ అవోపా సూచిస్తున్నది.
కామెంట్‌లు