సివిల్స్ వ్రాస్తున్న బీద విద్యార్థినికి ఆర్ధిక సహాయం

జనగామ జిల్లా అవోపా వారు చేయుచున్న సేవా కార్యక్రమములో భాగంగా చదువులో రాణిస్తూ ఉన్నత విద్యనభ్యసించాలన్న తలంపుతో పలు పోటీ పరిక్షలు రాస్తూ డిగ్రీలో అత్త్యుత్తమ మార్కులు సాధించి సివిల్ సర్వీసెస్ పోటీపరీక్షల్లో ఉత్తీర్ణురాలవ్వాలన్న లక్ష్యముతో శ్రమిస్తున్న రఘునాథపల్లి నివాసితులైన పుల్లూరి రాజమౌళి గారి కుమార్తె  పుల్లూరి మానసకు అవోపా జనగామ మరియు అవోపా హన్మకొండ వారు కలిసి రు.30,000/- ఆర్ధిక సహాయాన్నిఅవోపా జనగామ జిల్లా అద్యక్షులు శ్రీ గంగిశెట్టి ప్రమోద్ కుమార్, కార్యదర్శి బెజుగం బిక్షపథి గారల సుమక్షంలో మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవోపా అద్యక్షులు కాచం అంజయ్య గారి చేతుల మీదుగా అమ్మాయి బంధువులకు చెక్కు రూపంలో అందజేయడం జరిగినది. వీరి దాతృత్వానికి తెలంగాణ రాష్ట్ర అవోపా అభినందనలు తెలుపుచూ మిగతా అవొపాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఉద్భోదిస్తున్నది. 


కామెంట్‌లు