శాతవాహన ప్రాంతీయ సదస్సు

తేదీ 21.7.2019 రోజున హుజురాబాద్ వాసవి కళ్యాణ మండపం లో అవోపా శాతవాహన ప్రాంతీయ సమావేశాలు వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్ రావు, తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు గంజి స్వరాజ్యబాబు ముఖ్య అతిథు లుగా, విశిష్ట అతిథిగా తెలంగాణ రాష్ట్ర అవోపా ముఖ్య సలహాదారు పోకల చందర్, తోట లక్ష్మణరావు  ప్రాధాన కార్యదర్శి నిజాం వెంకటేశం, ఆర్ధిక కార్యదర్శి చింత బాలయ్య, ఎడిటర్ నూకా యాదగిరి, సామా నారాయణ, పాతా వెంకట నర్సయ్య, బాపిరాజ తదితరులు హాజరుకాగా  జంధ్యం మధుకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో శాతవాహన ప్రాంత పరిధిలోని అనేక అవోపాల ప్రతినిధులు పాల్గొన్నారు. జంధ్యం మధుకర్ గారు మాట్లాడుచూ శాతవాహన రీజియన్లోని 11 జిల్లా 20 యూనిట్ అవొపాలు చక్కగా పని చేస్తున్నాయని కొత్త రెవెన్యూ డివిజన్లలో అవోపాలను ఏర్పాటు చేయాలని, విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహించి అవొపాలు సేవలకు ప్రతి రూపాలన్నట్లు చేయాలన్నారు. రాష్ట్ర అవోపా చీఫ్ కోఆర్డినేటర్ చంద్రమౌళి గారు అవొపాలు అసూయా ద్వేషాలు విస్మరించి అవోపాల అభ్యున్నతికి పాటు పడాలనీ,  ఆర్థిక కార్యదర్శి మాట్లాడుచూ సంఘ ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని కోరారు.  నూకా యాదగిరి గారు అవోపా బులెటిన్ ఎడిటర్ గారు మాట్లాడుచూ బుల్లెటిన్లో వధూవరుల ప్రకటనలు ఇవ్వడం వలన సుమారు 8 పెళ్లిళ్లు కుదిరాయని, అవోపా న్యూస్ బులెటిన్ సేవలను మెచ్చి గూగుల్ మనకు ఉచిత వెబ్సైట్ (https://avopabulletin.page)ని బహుమతిగా ఇచ్చినదని, దీని వలన అవోపా వార్తలను వెంటనే అందరికి అందుబాటులో ఉంచవచ్చని కావున అన్ని అవోపాల పి.ఎస్.టీలు ఈ అవకాశాన్ని సద్వినియోగ బరచుకోవాలని, ఇతోధికంగా వైశ్యులను బులెటిన్ చందాదారులుగా చేర్చి సర్కులేషన్ పెంచాలని, వ్యాపార ప్రకటనలు, వివాహ ప్రకటనలు సేకరించి బులెటిన్ కు అండగా నిలవాలని కోరుతూ ఒక ప్రతిని మేయర్ గారికి అంద జేసారు. ముఖ్య అతిథి పోకల చందర్ మాట్లాడుచూ అ. వో. పా అనగా "ఆత్మీయతను పంచుకుంటూ వోపికను పెంచుకుంటూ పాటుపడేవారే అవోపా వారు" అని వివరిస్తూ తనదైన శైలిలో అశుకవిత్వంతో అవోపా మంచిర్యాల సేవలను ప్రశంసిస్తూ హాస్య ఛలోక్తులతో సభను మైమరపించి ఆకట్టుకున్నారు. ముఖ్య అతిథి మేయర్ గుండా ప్రకాశ్ రావు మాట్లాడుతూ సమాజ సేవలో వైశ్యులు ఎప్పుడూ ముందుంటారని, అత్యధిక జనాభా కలిగున్నందున ఉత్తరాది రాష్ట్రాలలో లాగా తెలంగాణలో కూడా రాజకీయంగా ఎదగాలని మేయర్ కోరారు. మేయర్ గా ప్రజలకు సేవజేయు భాగ్యం కల్పించిన సీఎం కేసీఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  రీజియన్లోని పి.ఎస్.టీల అడ్రసులు ఫోన్ నెంబర్లు కలిగిన డైరెక్టరీని శ్రీ ప్రకాశ్ రావు విడుదల చేశారు. హుజురాబాద్ పట్టణంలోని ముగ్గురు ఆర్య వైశ్య వృద్ధ దంపతులను, ముఖ్య మరియు విశిష్ట అతిథులను, రాష్ట్ర అవోపా ప్రతినిధులను, మధుకర్ ను మేయర్ గారు సన్మానించారు.






కామెంట్‌లు