This is header
జాబ్ మేళా

అఖిల భారత అవోపాల ఫెడరేషన్ (ఐఫా) వారు 2019 జాబ్ మేళా ఐ.ఐ.ఎం.సి వాసవి సేవా కేంద్రం కాంప్లెక్స్, లకడికపుల్, ఖైరతాబాద్ లో 27.7.2019 లో నిర్వహించారు. నిరుద్యోగ యువతను సమీకరించి వారికి తగిన ఉద్యోగాలు ఇవ్వగోరు ఎంప్లాయర్స్ ను ఒక వేదికపై ఆహ్వానించి ఎక్కువ శ్రమ పడకుండా సరైన మార్గ నిర్దేశనము చేసి ఆత్మ విశ్వాసముతో ఇంటర్వ్యూలలో పాల్గొనుటకు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీ గంపా నాగేశ్వరరావు మరియు సంబంధిత 8 మంది ఫ్యాకల్టీ ఎక్సపర్ట్స్ తో 26.7.2019 రోజున వాసవి కళ్యాణ మండపంలో సుమారు 250 మంది నిరుద్యోగులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. తేదీ 27.7.2019 రోజున ఖైరతాబాద్ లోని ఐ.ఐ.ఎం.సి కళాశాలలో జాబ్ మేళా నిర్వహించినారు. ఈ జాబ్ మేళా నిర్వహించుటకు సుమారు 1600 ల పనిదినాలు పట్టగా 603 ఇంటర్వ్యూలు ఏర్పాటు చేయగా 8 మందికి మొదటి విడతలో 8 మందికి ఉద్యోగాలు లభించగా సుమారు 306 మంది కి రెండవ విడతలో ఉద్యోగాలు ఇచ్చుటకు యజమానులు అంగీకరించారు. ఈ కార్యక్రమానికి సుమారు 11,000 మంది నిరుద్యోగ యువత దరఖాస్తులు పంపగా అందులో సుమారు 600 మంది రిజిస్ట్రీ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 75 మంది ఎంప్లాయర్స్ హాజరైనారు. ఈ కార్యక్రమ నిర్వహణకు సుమారు 40 మంది చేయూత అవసరమైనది. ఐఫా కార్యవర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్ష కార్యదర్శులు, ఆర్ధిక కార్యదర్శి, అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూకా యాదగిరి, నంబరుమల్లు, సత్యనారాయణ, సంపత్, బ్యాంక్మెన్ చాప్టర్ రమణయ్య, అవోపా హైదరాబాద్ పూర్వాధ్యక్షుడు మూర్తి తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంత మొనర్చినారు. ఈ కార్యక్రమమంతయూ అఖిల భారత అవోపాల ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ బల్ది శ్రీధర్, కోటేశ్వర రావు ఆధ్వర్యంలో ప్రాజెక్టు చైర్మన్ శ్రీ నరేష్ బాబు కొ-చైర్మన్ విజయ్ గుప్తా నేతృత్వంలో మరియు ఐ.ఐ.ఎం.సి వాసవి సేవా కేంద్రం కాంప్లెక్స్, లకడికపుల్, ఖైరతాబాద్ కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ శ్రీ కూర రఘువీర్ గారి మరియు వాసవి సేవా కేంద్రం వారి కొండంత సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం సంపూర్ణమైనది. అందులకు తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్ష కార్యవర్గము అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము ఐఫా అధ్యక్ష కార్యవర్గానికి, ప్రాజెక్ట్ చైర్మన్ నరేశ్ బాబుకు, కూర రఘువీర్ గారికి, అత్యంత శ్రమకోర్చి హాజరైన ఫ్యాకల్టీ ట్రైనర్సకు, ఇంపాక్ట్ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి అభినందనలు తెలుపుచున్నది.




This is footer
కామెంట్‌లు