అవోపా కోదాడ వారిచే ఆహార పంపిణీ



గత 9 రోజులుగా హైవే పై నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీలకు చేస్తున్న ఆహారం పంపిణీకి మన AVOPA జీవితసబ్యుడు, కమిటీ మెంబర్, విద్యానిది మహారాజ పోషకులు, భారత ప్రభుత్వరంగ ప్రముఖ రసాయనిక ఎరువుల కంపెనీ మద్రాస్ ఫర్టిలైజర్స్ మార్కెటింగ్ డివిజన్ విశ్రాంత  చీఫ్ మేనేజర్  శ్రీ స్వామి శ్రీనివాసరావు వీరి ధర్మపత్ని నాగమణి మరియు మన జీవిత సభ్యుడు, కమిటీ మెంబర్ పైడి మర్రి నారాయణ గార్ల సహకారంతో 120 మంది హైదరాబాద్ నుండి ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ విజయవాడ నుండి UP,MP వెళ్లే వలసకూలీలకు కట్టేపొంగలి, చపాతీలు , నీళ్ళు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అవోపా ఉపాధ్యక్షులు కండిబండ వెంకటేశ్వర రావు, వంగవేటి లోకేశ్, చక్కా కృష్ణప్రసాద్, వెంపటి రంగారావు, కొండ్లే రవిచంద్ర, చల్లా వెంకటేశ్, పైడిమర్రి అనిరుధ్, అభిరామ్ తదితరులు  పాల్గొన్నారు.


 


కామెంట్‌లు