పాదచారులకు, బీదలకు, కూలీలకు ఆహారం సరఫరా చేయుచున్న అవోపా కోదాడ వారు గోవులు ఆకలితో అలమిటిస్తున్నవని గమనించి తేదీ 8-5-2020 రోజున వనమా సాహితీ- వాసు చెన్నై, తాడికొండ ఫణిప్రియంక-TLS దత్తు దుబాయ్, ఏచూరు శశాంక- లక్ష్మీ కృష్ణానంద్ హైదరాబాద్, దాసా పద్మ కోదాడ వారి సౌజన్యంతో ఒక ట్రాక్టర్ గడ్డిని పశుగ్రాసంగా గోశాలకు ఇప్పించారు. మనుషుల ఆకలి తీర్చుటయే గాక పశువుల బాధను అర్థం చేసుకొని వాటికి ఆహారంగా గడ్డిని సమకూర్చి పెద్ద మనసును చాటుకున్నారు, వారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెలియజేయు చున్నవి.
పశువుల ఆకలి తీర్చిన అవోపా కోదాడ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి