టౌన్ అవోపా మంచిర్యాల వారిచే ఆహారం పంపిణీ


అవోప మంచిర్యాల చేపట్టిన అన్నదానం కార్యక్రమం ఈరోజుతో 40వ రోజు. ఈరోజు 200 మందికి భోజనాలు మరియు పెరుగు అన్నమును వలస కూలీలకు మరియు ఇతరప్రాంతలకు వెళుతున్న ప్రయాణికులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సత్యవర్ధన్, రాష్ట్ర అవోప కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్, కార్యదర్శి సాయిని సత్యనారాయణ, కోశాధికారి నెరేళ్ళ శ్రీనివాస్, సభ్యులు షెగంటి భాస్కర్, దీక్షితులు అయ్యగారు ,మన గౌరవసభ్యులు పోలీసు శాఖ ఎ.ఎస్.ఐ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.


కామెంట్‌లు