దియా జలావో ..... కరోన కో ఖతం కరో - రచన : ' ప్రపంచ రికార్డుల గ్రహీత ' 'కవిరత్న' డాక్టర్ చింతల శ్రీనివాస్ 


ఆదివారం, ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటలకు, 9 నిమిషాలు అఖండ భారతావనిలో, ఒక్కో వెలిగించిన క్రోవ్వొత్తి దివ్య ఖడ్గ ఔషధమై, దివ్వె కాంతి మహా చక్రమై, టార్చిలైటు సర్చి చేసి వెంటాడే సంహారకమై, మొబైల్ ఫ్లాష్ లైట్ ఫినిష్ చేసే "దుష్ట కరోన నరకాసురున్ని నరకాలి... కోవిద్-19ని నామరూపాలు లేకుండా, భూగోళం నుండి తుడిచి వేయాలి"... మన '9 రాత్రుల లాక్ డౌన్' దేవి నవరాత్రుల 'అపరాజిత మాతగా' కరోనాను చీల్చి చెండాడాలి... '9' సంఖ్యతో 'సఖ్యత' గల 'కుజ ప్రభావంతో ', అఖిల జనావళికి అపార ధైర్య సాహసాల్ని , 'సంకల్ప మహాకాంతిశక్తి' నివ్వాలి... కోటానుకోట్ల దివ్వెల కాంతిమహాసముద్ర ఫోటానులు... ఖండఖండాంతరాల్లో విస్తరించిన 'కరోనా మహమ్మారిపై' అణుబాంబై 'అటామిక్ ఎనర్జీతో ' కోవిద్-19ను అడ్రస్ లేకుండా చేయాలి, విశ్వ మానవ ఆరోగ్యప్రదాత' గా వెలగాలి. 'మానవ చరిత్ర' లో మరో మహనీయఘట్టం... 'ఆవిష్కృతం' కావాలి, ఎన్ని యుగాల కాలగతిలో నేటి మానవుడు మహనీయునిగా అవతరించాడు... కరోనాపై, కఠోర నియమ, నిష్టాగరిష్ఠునిగా వెలుగుతున్నాడు. ''విజయం 'తథ్యం' మానవులకు''... కరోనా 'అంతం' చూడాలి మనమందరం...


కామెంట్‌లు