పోలీసులకు మాస్కులు, శానిటైజేర్స్ అందజేత


లాక్ డౌన్లో పోలీసులు నిర్విరామంగా శ్రమ పడుచున్నారని, వారి ప్రాణాలను సైతం లెక్కచేయక ప్రజల ప్రాణాలు కాపాడుటకు పాటు పడుచున్నారని అందులకు వారిని అభినందిస్తూ, వారు వైరస్ బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరమున్నదని భావించి వారి రక్షణ కోసం రూ.78 లక్షల విలువైన మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లను ఈస్ట్ ఇండియా పెట్రోలియం ప్రైవేటు లిమిటెడ్ (ఈఐపీపీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణ మరియు ఎబోడ్ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధి బీ. నాగరాజు మంగళవారం హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర అవోపా గౌరవ సలహాదారు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తో కలిసి డీజీపీ మహేందర్ రెడ్డికి అందజేశారు. డిజిపి గారు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. పై సంస్థలను మోటివేట్ చేసినందులకు కోలేటి దామోదర్ గారిని మరియు పోలీసులకు స్వీయ రక్షణ పరికరాలు అందజేసినందులకు పై సంస్థల అధికారులను తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందిస్తున్నవి.


కామెంట్‌లు