విశిష్ట సేవలందిస్తున్న ఉప్పల ఫౌండేషన్

 


 టీఆరెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు లాక్ డౌన్ నేపద్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఉప్పల ఫౌండేషన్ తరపున భారీఎత్తున ఆహార పంపిణీ చేయటం జరిగింది. మనుషురాబాద్ లోని ఎరకల బస్తీ, సౌథండ్ పార్కు, మనుషురాబాద్ చౌరస్తా, రాజీవ్ గాంధీ నగర్, ఎన్ఠీఆర్ నగర్, వికలాంగుల అమ్మ ఆశ్రయ ఫౌండేషన్, జ్యోతి ఓల్డేజ్ హోమ్ లలోని మొత్తం 2వేలమందికి ఆహారం పంపిణీ చేశారు.. ఈ  కార్యక్రమంలో టీఆరెస్ నాయకులు షఫీ, అశోక్ యాదవ్, ఐవీఎఫ్ స్టేట్ నాయకుడు కూర నాగరాజు, రంగారెడ్డి జిల్లా ఐవీఎఫ్ ప్రెసిడెంట్ ఆలేటి రవి, జనరల్ సెక్రటరీ జగదీష్ గుప్త, ఐవీఎఫ్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్, ఉప్పల యువసేన నాయకుడు అమరవాది అనిల్ ప్రసాద్, ఉప్పల యువసేన నాయకుడు సాయి, టీఆరెస్ ఎల్బీ నగర్ మైనార్టీ నాయకుడు మహమ్మద్, బాబా తదితరులు ఈ ఆహార పంపిణీ  పాల్గొన్నారు. రేపటి నుండి 2వేలమందికి ఆహారాన్ని నాగోల్ లోని శివ ఫంక్షన్ హాల్ లో తయారుచేయించి గ్రేటర్ హైదరాబాద్ లోని కూలీలు, వలస కార్మికులు, జీహెచ్ఎంసీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు అందిస్తామని ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు తెలిపారు. ఉప్పల ఫౌండేషన్ ఆపన్న హస్తం తప్పక అందిస్తుందని ఎవరికైనా ఆహారనికి, నిత్యావసరాలకు ఇబ్బందులు ఉంటే తమను సంప్రదించాలని ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు తెలియజేస్తున్నారు.కామెంట్‌లు