ఐఫా వారి వీడియో కాన్ఫరెన్స్

తేదీ 26.4.2020 రోజున అఖిల భారత అవోపాల ఫెడరేషన్ వారు ఈ.సి మీటింగ్ వీడియో కాన్ఫరెన్స్  ద్వారా నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫెరెన్సులో సుమారు (28) మంది సభ్యులు దేశ వివిధ ప్రాంతాలనుండి పాల్గొన్నారు. వారి వారి ప్రాంతాల్లో చేబట్టిన కరోన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. తెలంగాణ రాష్ట్ర అవోపా ప్రతినిధిగా మరియు ఐఫా వెబ్సైట్ చైర్మన్ గా పాల్గొన్న అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూకా యాదగిరి గారు లాక్ డౌన్ సందర్భంగా పలు ఇబ్బందులకు గురౌతున్న వలస కూలీలకు, పోలీసులకు, పారిశుధ్య కార్మికులకు, దినసరి కూలీలకు, బీదలకు, వయోవృధ్ధులకు, పాత్రికేయులకు, జూనియర్ న్యాయవాదులకు తదితర అన్ని వర్గాల వారికి తెలంగాణ రాష్ట్రంలో పలు అవొపాలు నిర్వహించుచున్న సంక్షేమ కార్యక్రమాల గురించి, ప్రతినిత్యం అవోపా మంచిర్యాల, జిల్లా పట్టణ అవోపా మంచిర్యాల, అవోపా హనుమకొండ, మహబూబ్ నగర్, కాగజ్ నగర్, పరకాల, జమ్మికుంట, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, హుజుర్నగర్, కోదాడ, కామారెడ్డి, బ్యాంక్మెన్ చాపుటర్ మొదలగు అవొపాలు పంపిణీ చేయు అల్పాహారం, ఆహార పొట్లాలు మరియు, నిత్యావసర వస్తువులు, సానిటైజర్స్ గురించి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అవోపా వాసవి సేవా కేంద్రంతో మరిన్ని వైశ్య సంస్థలతో కలిసి సంయుక్తంగా ప్రతిరోజూ 400 మందికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేయుచున్నదని ఇందులకు రాష్ట్ర అవోపా రూ. లక్ష విరాళము అందజేసినదని మరియు రూ.2 లక్షల విరాళము ముఖ్యమంత్రి సహాయనిధికి పంపుటకు ఏర్పాట్లు చేయు చున్నామని తెలుపగా సభ్యులందరు తెలంగాణ రాష్ట్ర అవొపకు అభినందనలు తెలిపారు. ఐఫా సీనియర్ ఉపాధ్యక్షుడు, ప్రపంచ అవార్డుల గ్రహీత కవిరత్న డాక్టర్ చింతల శ్రీనివాస్, రవి, లక్ష్మీనారాయణ తదితరులు అవోపా వార్తలు బులెటిన్లో వెంటవెంటనే ప్రచురింపబడుచున్నాయని, ఐఫా వార్తలను, తమ కవితలను కూడా  అవోపా న్యూస్ బులెటిన్ ప్రచురిస్తున్నదని,  అవోపా న్యూస్ బులెటిన్ సేవలను కొనియాడారు. సమాజంలోని కుల, మత లింగబేధం లేని బీద అవసరార్ధులకు విద్యా మరియు వైద్య రంగంలో కోవిద్-19 బాధితుల సహాయార్థము ఈ సమావేశములో చర్చించి,  కోవిద్-19 బాధితుల సహాయక కమిటీని ఏర్పాటు చేసి దాని చైర్మన్ గా కవిరత్న డాక్టర్ చింతల శ్రీనివాస్, కోచైర్మన్లు గా అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూకా యాదగిరి,  ఈ. నరేందర్ మరియు సభ్యులుగా  ప్రసాద్, సోమశేఖర్, మైలవరపు లక్ష్మీనారాయణ మరియు ఇల్లెందుల శ్రీధర్ లను నియమించి కోవిద్-19 బాధితులకు వైద్యోపకరణాల మరియు వైద్య సేవల గురించి సహాయ పడడానికి డోనేషన్స్ వసూలు చేసి ఏదైనా రీజిస్టర్డ్ లేదా ఆదాయ పన్ను చెల్లించు సంఘముల ద్వారా సేవాలందించ డానికి తీర్మానించారు. ఐఫా వారి అజెండా ఐటమ్స్ ఆమోదించిన పిదప కార్యవర్గ సమావేశము ముగించనైనది. 


కామెంట్‌లు