తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ వారి విజ్ఞప్తి


తేదీ 1.4.2020 రోజటి మా విజ్ఞప్తిని మన్నించి కోవిద్-19 మహమ్మారిని ఎదుర్కొనుటకు చేయుచున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఇంట్లోనే పరిమితమై ఉండి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు లోబడి వ్యక్తిగత దూరం పాటించడం, ఎల్లవేళలా పరిశుభ్రంగా వుండుటకు తరచు సానిటైజర్ తో చేతులు కడుక్కోవడం, సామూహిక సమావేశాలను బహిష్కరించడం లాంటి ఆరోగ్య పరిశుభ్రతను పాటించాలని పూర్వ వాసవి ప్రభ చీఫ్ ఎడిటర్ శ్రీ చింతల శ్రీనివాస్ మరియు టిఅవోపా ముఖ్య సలహాదారు శ్రీ పోకల చందర్ గారలు తదితరులు తమ కవితల ద్వారా మరియు విజ్ఞప్తుల ద్వారా మేమిచ్ఛే అన్ని సూచనలన్నీ పాటిస్తూ అలాగే లాక్డౌన్ సందర్భంగా వ్యాపారాలన్నీ మూతబడి రెక్కడితేనే డొక్కాడు రోజు కూలీలకు పట్టెడన్నము కరువై ఆకలితో అలమటించుచున్న వేళ వారికి రాత్రనక పగలనక బాధ్యతతో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు వారికి, పొట్టకూటికై స్వంత గ్రామమును, జిల్లాను, రాష్ట్రాన్ని వదిలి మన తెలంగాణా రాష్ట్రానికి వలస వచ్చిన రోజువారీ కూలీలకు, మన నిర్మాణ రంగంలో, ఉత్పాదక రంగంలో చమటోడ్చి శ్రమచేస్తూ, ఒక రకంగా మన అభివృద్ధిలో భాగస్వాములౌతున్న వారికి, సమయ సందర్భాలగురించి అలిచించక, తన వారిని తన ఇంటిని వదిలి ప్రజలకు ఎప్పటికప్పుడు తాజా వార్తలందించాలని తాపత్రయ పడుతూ భోజనం చేసి చేయక ప్రాణాలను సైతం లెక్క చేయక వార్తలను మనకందించు మీడియా వారికి, కరోన బాధితులకు స్వాంతన చేకూర్చుటకు, వారిని తిరిగి ఆరోగ్యవంతులుగా చేయుటకు, ఇంటిని పిల్లలను, కుటుంబాన్ని సైతం లెక్కచేయక అహోరాత్రుళ్ళు కష్టపడుచున్న వైద్య సిబ్బందికి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, అంటువ్యాధులు సైతం ప్రభలకుండా జాగ్రత్తలు తీసుకొనుచున్న పారిశుద్ద కార్మికులకు, అత్యవసర పరిస్థితుల్లో సేవ చేయుచున్న, విద్యుత్, నీటి సరఫరాలకు విఘాతం కలుగకుండా సేవలందించుచున్న విద్యుత్, నీటి సరఫరా చేయు అధికారులకు, లాక్డౌన్ లో ఇంట్లో వుండవలసి యుండి కూడా తన ఆరోగ్యాన్ని లెక్కచేయక ప్రజలకు ఆహారాన్ని అందించుటకు పొలాల్లో పనిచేయుచూ, అలుపెరుగక, విశ్రాంతి సైతం తీసుకొనక తాను పండించిన పంటను ప్రజల ఆకలి తీర్చుటకు సరఫరా చేయుచున్న రైతన్నలకు, ఇంకా భిక్షాటనే వృత్తిగానెంచుకుని జీవిస్తున్న అభాగ్యులకు, కన్నవారు దూరంచేయగా, శివైక్యానికై ఎదురుచూస్తూ భారంగా బ్రతుకునెల్లదీయుచున్న వృధ్ధాశ్రమ వాసులకు, ఉద్యోగాన్వేషణతో పట్టణాలకు విచ్ఛేసి ఉద్యోగాలు దొరకక, చేతిలో చిల్లి గవ్వలేక ఆకలితో అలమటిస్తున్న నిరుద్యోగ యువతకు, వీరేకాక ప్రతి రోజూ తన మరియు తన వారి కడుపులు నింపుటకు మరియు ఆకలి చ్చావుళ్ళకు ప్రజలు బలికాకుండా పెద్ద మనసుతో రాష్ట్ర ఖజానానుండి పెద్ద మొత్తములు ఖర్చు చేయుచూ ప్రజలను కనురెప్పలుగా కాపాడుకుంటూ అందరికి ఆహారాన్ని నిత్యావసర వస్తువులను అందించుచున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరియు తోటి మానవులకు సేవ చేయాలని మానవ సేవయే మాధవ సేవయని భావించి ఆహార పొట్లాలను, నిత్యావసర సరుకులను వారి వారి తాహాతు మేరకు అందిస్తున్న రాష్ట్రంలోని అనేక సేవా సంస్థలు, దానాలకు చిరునామా వైశ్యులన్న నానుడిని సార్థకం చేయుచూ ఉపాహారము, మధ్యాహ్న రాత్రి భోజనాలను అందిస్తూ, తమ విశాల హృదయాన్ని చాటుకుంటున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్, కాచం ఫౌండేషన్, వాసవీ సేవా కేంద్రం, కాచిగూడ వైశ్య హాస్టల్, తన ప్రజలను కరోన బారిన పడకుండా రక్షించుకోడానికి అహోరాత్రుళ్ళు శ్రమిస్తూ నిరాటంకంగా లక్డౌన్ అమలు చేస్తూ అన్నార్థుల క్షుద్బాధను తీర్చేదనని మాటిచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి అభిష్టానుసారం ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు రు.10 లక్షలు డొనేట్ చేసి అంతటితో ఆగక రోజూ 20 వేల ఆహార పొట్లాలు బీదలకు, వలస కూలీలకు అందించుటకు ప్రణాళికలు రచించి వివిధ సేవా సంస్థల ద్వారా ఆహార పొట్లాలు సేకరించి పంచిపెడుతున్న రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గారు మరియు ఇతర వైశ్య, వైశ్యేతర బంధువులు, మీ అందరితో పాటుగా మేము సైతం అని తెలంగాణ రాష్ట్ర అవోపా పిలుపు మేరకు అహర్నిశలు శ్రమిస్తూ సేవచేయుచున్న తెలంగాణ రాష్ట్ర నలుమూలల్లో నెలకొన్న అవొపా హైదరాబాద్, మంచిర్యాల, మహబూబ్నగర్, అవోపా బ్యాంక్మెన్ చాపుటర్, అవోపా జమ్మికుంట, కాగజ్నగర్ మొదలగు ఎన్నో అవొపాలు ఆహార పొట్లాలు అందిస్తూ సేవజేస్తూ కరోన బారిన పడిన వారి యోగక్షేమాలకు, అవసరమైన వైద్యోపకరణలకు మరియు కరోన మహమ్మారిని ధీటుగా నెదుర్కోనుటకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చంద్రునికో నూలుపోగుగా మనవంతు సహాయమందిద్దామని మేమిఛ్చిన పిలుపుమేరకు దయార్ద్ర హృదయులై, తోటి మానవులకు చేయూతనివ్వాలన్న తపనతో చాలా యూనిట్ అవొపాలు తమవంతు సహాయముగా విరాళాలు ''తెలంగాణ రాష్ట్ర అవోపా'' ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఖాతా నంబరు 08712191039449 మరియు ఐ.ఎఫ్.ఎస్ నెం.ORBC 0100871 నకు విరాళాలు పంపించిన యూనిట్ అవోపాల అధ్యక్ష, కార్యదర్శులకు మరియు నిరంతరం సేవ చేయుచున్న వైశ్య సంస్థలకు, దయార్ద్ర హృదయులకు పేరు  పేరునా అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తూ పంపించని వారు కూడా దయచేసి పరిస్థితులను గమనించి, వారి చేయూత కూడా ఈ సందర్భంగా అవసరమని గుర్తించి విశాల హృదయులై, కారుణాంతరంగ మనస్కులై వారి వారి సభ్యులను సముదాయించి సమాయత్త పరచి, ఈ మహాయజ్ఞంలో మనము కూడా పాలు పంచుకుని మానవాళి మనుగఢకు మనవంతు సహాయమందిద్దామని ఉత్తేజపరచి వీలైనన్ని చందాలను సేకరించి మా ఖాతాలో చెల్లించి మా ఈ చిన్నిప్రయత్నాన్నీ ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మనము కూడా భాగస్వాములైనామనిపించాలని వినమ్రతా పూర్వకముగా మరొక్కసారి విజ్ఞప్తి చేయుచున్నాము. మన అందరి సేవా భావానికి, సకల మానవాళి మనుగడకు మనము చేయుచున్న ఈ ప్రయత్నానికి మన కులదైవం, ఆరాధ్య దేవత శ్రీ శ్రీ శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి సంతుష్టినొంది మీపై వారి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ప్రసారింపజేయాలని తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు గంజి స్వరాజ్యబాబు, ప్రధాన కార్యదర్శి నిజాం వెంకటేశం, ఆర్థిక కార్యదర్శి చింతా బాలయ్య, ముఖ్య సలహాదారు పోకల చందర్, చీఫ్ కోఆర్డినేటర్ గుండా చంద్రమౌళి మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదకులు నూకా యాదగిరి ముకులిత హస్తాలతో విన్నవించు కొనుచున్నారు.


కొనుచున్నారు.


                    జై వాసవి జై జై వాసవీకామెంట్‌లు