వాసవి సేవా కేంద్రం వారిచే ఆహార పొట్లాల పంపిణీతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు లక్డౌన్ సందర్భంగా నిరంతరం విధులు నిర్వహిస్తున్న సుమారు 4000 మంది పోలీసులకు, పరిశుధ్య కార్మికులకు ఖైరతాబాద్ లోని వాసవి సేవ కేంద్రం వారు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు ఇతర ఆర్యవైశ్య సంస్థల సౌజన్యంతో ప్రతి రోజూ ఆహార పొట్లాలు పంపిణీ చేయు చున్నారు. రాష్ట్ర మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ సేవా కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లు పర్యవేక్షించారు, వారితో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, కేంద్రం అధ్యక్షుడు కాసనగొట్టు రాజశేఖర్, శాశ్వత సలహాదారులు బొగ్గారపు దయానంద్, కె. మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. వాసవి సేవా కేంద్రం సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు.


 


కామెంట్‌లు