కరోనా ... అంతం కావాలి ఇక (కవిత)                  రచన : "కవిరత్న" డాక్టర్. చింతల శ్రీనివాస్,        గ్లోబల్ చైర్మన్, లిటరరీ ఫోరమ్, WAM


ఇకపై ఈ శతాబ్దం ... 'కరోనాకి ముందు ... కరోనా తర్వాత' అవుతుందేమో !!!  భౌగోళిక హద్దులు, జాతులు, మతాలు, భాషా, ప్రాంత, వర్గ, కులాల మూలాలు ... 'సమతా గీతికను'  ఆలపించే రోజులు ... వస్తాయేమో???  'సంకల్పం' ... మహా ఆయుధమై, సామాజిక ఆరోగ్య భద్రతకు ... సామాజిక దూరం, 'ప్రకృతి ఆక్రోశానికి ... మానవ పశ్చాతాపం, వ్యక్తిగత, పరిసర పరిశుభ్రత ... పరమ పవిత్ర వ్రతం, అని 'కుటుంబ సంక్షేమం ... వ్యక్తిగత క్షేమంతో నూరుపాళ్లు ముడిపడి ఉంటుందని ... 'వ్యక్తిగతమే' ... శక్తి సూత్రం అవుతుందని ... 'నీ వొక్కరివే ... కుటుంబమై, సమాజమై, దేశమై, 'ప్రతిబింబం' కాగలదని ... 'జ్ఞానోదయం' అయ్యే వేళ ... ధ్యానోదయం ... మహా ఆరోగ్య కాంతిగా భాసిల్లే సమయ మిది ... ''ఓంకారం" విశ్వ నిర్మాణ మూలంగా ... సమస్త చైతన్య జగత్ కేంద్రంగా ... అందరూ గ్రహించే కాలమిది ... ఆత్మికం ... ఆధ్యాత్మికమై, భోగం ... యోగమై, ఈర్ష్యా - ద్వేషాలు ... వేదాంత చింతనా అగ్ని సమిధలై, మానసిక స్వచ్చత, శారీరక పరిశుభ్రతలు వీడని విలువలుగా, కలకాలం నిలవాలని, ఎల్లలు లేని ... మానవీయ, మాననీయ ... సహాయ, సహాకారాలే వర్తమాన మానవజాతి, ఆరోగ్య, ఆయువుల కొలమానాలని, "తెలుసుకోవాలి ... జగమంతా ... అమలు చేయాలి ... జనులంతా" ఇకనైనా ... అంతం కావే ... కోవిద్-19 ... అపవే ... శాశ్వతంగా ... నీ మరణ మృదంగం, "మానవ కళ్యాణం ... కావాలి ఆయువు ఆరోగ్యాలు ... వర్ధిల్లాలి".


కోవిద్-19 గురించి వినండి


కామెంట్‌లు