గోల్డెన్ జూబిలి సెలెబ్రేషన్స్లో విద్యార్థులకు మార్గదర్శనం చేసిన పొకల చందర్


తేదీ 1.3.2020 రోజున తెలంగాణ రాష్ట్ర అవోపా ముఖ్య సులహాదారు మరియు లయన్స్ క్వెస్ట్ గవర్నర్ శ్రీ పోకల చందర్ గారు కాకతీయ హైస్కూల్ గోల్డెన్ జూబ్లి సెలబ్రేషన్స్ లో హాజరై అధిక సంఖ్యలో పాల్గొనిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు నిర్దేశిత లక్ష్యాలను ఎలా చేరుకోవాలో వారి భవిష్యత్తు గురించి ఎలా మంచి దారులేర్పరచుకోవాలో, క్రమశిక్షణతో ఎలా మెదలాలో వారికి అర్థమగు విధముగా మరియు తల్లిదండ్రులకు పిల్లల బాగోగులు ఎలా చూసు కోవాలో, వారికి క్రమశిక్షణ ఎలా నేర్పాలో, వారి నిర్ధేశిత లక్ష్యఛేదనలో ఎలా తోడ్పడాలో మరియు చెడు మార్గాలననుసరించకుండా ఎలా కాపడుకోవాలో విపులంగా వివరించి సభికుల మన్ననలు పొందారు. 


కామెంట్‌లు