లక్సెట్టిపెట్ మున్సిపల్ చైర్మన్ గారిని సన్మానించిన అవోపా


లక్సట్టిపేట్ మున్సిపాలిటీకి ఇటీవల జరిగిన ఎన్నికలలో మన ఆర్యవైశ్య ప్రముఖుడు శ్రీ నలమాసు కాంతయ్య గారు చైర్మన్గా ఎన్నిక కాగా వారి పదవీ స్వీకార మహోత్సవం స్థానిక ఐ.బి.ఆవరణలో జరిగినది. ఈ సమావేశమునకు ముఖ్య అతిథి గా ఎం.ఎల్.ఏ దివాకర్ గారు హాజరైనారు. జిల్లా పట్టణ ఆవోపా ఆధ్వర్యములో చైర్మన్ అభ్యర్థి నలమాసు కాంతయ్య గారిని, వైస్ చైర్మన్ అభ్యర్థి పోడేటి శ్రీనివాస్ గౌడు గారిని మరియు 7 గురు కౌన్సిలర్లను ఘనంగా శాలువా మెమొంటోల తో సన్మానించారు. ఈ కార్య క్రమములో జిల్లా అధ్యక్షుడు గుండా సత్యనారాయణ పట్టణ అవోపా అధ్యక్షుడు పాలకుర్తి సుదర్శన్, అవోపా నాయకులు కిషన్, రాచర్ల సత్యనారాయణ, బొదుకూరి సత్తయ్య, గుండ సంతోష్, ఎల్లంకి సత్తయ్య, అక్కనపెళ్లి కోటయ్య, బజ్జురి మోహన్, నారాయణ, భీమన్న మరియు ౩౦మంది ఆవోపా సభ్యులు పాల్గొన్నారు.


కామెంట్‌లు