అవోపా హైదరాబాద్ వారి హోమియో వైద్య శిబిరం


తేదీ 15.2.2020 రోజున అవోపా హైదరాబాద్ వారు హైదరాబాద్ బేగంపేట లోని హోమియో కేర్ హాస్పిటల్ లో హోమియో క్యాంపును నిర్వహించారు. హోమియో కేర్ సి.ఈ.ఓ సుధీర్ రెడ్డి గారు హోమియోపతి వైద్యవిధానం గురించి మరియు అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందిన హోమియో కేర్ ఇంటర్నేషనల్స్స్ కాంస్టిట్యూషల్ చికిత్సల గురించి వివరించారు. హాస్పిటల్ లోని పేరొందిన ప్రముఖ వైద్యులచే అవోపా సభ్యులకు పరీక్షలు నిర్వహించి మందులిచ్చారు. ఈ రోజు ముఖ్యంగా అవోపా హైదరాబాద్ వారికి అందించిన ప్యాకేజీ లో డాక్టర్ కన్సల్టేషన్, 3 నెలలకు సరిపడా మందులు కేవలము రు.1000 లకే అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని సుమారు 20  మందికి పైగా అవోపా హైదరాబాద్ సభ్యులు ఆరోగ్య పరీక్షలు చేపించుకుని మందులు పొందారు, వారికి శ్రీ కె.రాజేశ్వరరావు మరియు హరనాథ్ గారలు సహకరించారు.. ఆరోగ్య శిబిరం అధ్యక్షుడు నమశ్శివాయ మరియు కార్యదర్శి రవి గుప్త గారల పర్యవేక్షనలో ఈ క్యాంప్ సంపూర్ణమైనది. ఈ కార్యక్రమంలో తక్కువ ధరకు విశేష సేవలందించిన హోమియో కేర్ సి.ఎం.డి డా.శ్రీకాంత్ మోర్లవార్ మరియు వారి కుమారుడు డా.అభినయ్ మోర్లవార్ గారలను ఉచితరీతిన అధ్యక్ష కార్యదర్శులు సన్మానించారు. హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లు అవోపా సభ్యుల గురించి తగు శ్రద్ధ తీసుకుని విశేష సేవాలందించారని తెలుపుతూ వారందరికీ అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలియజేశారు. 


 
కామెంట్‌లు