జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కు వైశ్య అనుబంధ సంస్థల సన్మానం


తేదీ 16.2.2020 రోజున జనగామలో ఆర్యవైశ్య అనుబంధ సంస్థలన్నియు ఒక్కటై ఒకే వేదికమీద ఇటీవల మున్సిపల్ ఎన్నికలలో గెలిచిన ఛైర్పర్సన్ శ్రీమతి పోకల జమున లింగయ్య గారికి మరియు కౌన్సిలర్ గా గెలిచిన శ్రీ హరిశ్చంద్ర గుప్త గారలకు పూర్ణిమా గార్డెన్స్, జనగామలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సన్మాన మహోత్సవానికి తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు గంజి స్వరాజ్యబాబు, ముఖ్య సులహాదారు, పూర్వాధ్యక్షుడు, లయన్స్ క్లబ్ క్వెస్ట్ గవర్నర్ శ్రీ పోకల చందర్ గారు ఐ.వి.ఎఫ్ జనగామ జిల్లా అధ్యక్షులు బిజ్జాల నవీన్ కుమార్, కార్యదర్శి శర్విరాల ఉపెందర్, అవోపా జనగామ జిల్లా అధ్యక్షుడు శ్రీ గంగిశెట్టి ప్రమోద్ కుమార్ గారు, కార్యదర్శి బెజగం బిక్షపతి గారు, కోశాధికారి మంచెన హరీష్ గారు,  వాసవి క్లబ్ జనగామ అధ్యక్షులు గట్టు వెంకటేశ్వర్లు, కార్యదర్శి కందుకూరి కుమార్ గారు, కోశాధికారి వీరేశం గారు, పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ఆర్గుల శ్రీనివాస్, కార్యదర్శి గట్టు వెంకటేశ్వర్లు, కోశాధికారి పబ్బా సంపత్, వైశ్య హాస్టల్ కమిటీ జనగామ అధ్యక్షులు పజ్జురి లక్ష్మీ నరసయ్య, కోశాధికారి జీడిగం వీరేశం తదితరులు హాజరుకాగా, సభాధ్యక్షత జనగామ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవాధ్యక్షుడు పజ్జురి గోపయ్య గారు వహించగా ముఖ్య అతిథిగా జనగామ శాసన సభ్యులు శ్రీ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు విచ్ఛేయగా, గౌరవ అతిథులుగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ ప్రెసిడెంట్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు, మిత్తింటి వెంకటేశ్వర్లు, గట్టు మహేశ్ బాబు, గార్ల పాటి సంతోష్ కుమార్, నాగబండి సుదర్శనం, వైశ్య హాస్టల్ కమిటీ కార్యదర్శి మరియు పూర్వ ఆంధ్రప్రదేశ్ అవోపా అధ్యక్షుడు శ్రీ కాసం అంజయ్య గారు, కాశీ అన్నపూర్ణ సత్రం వ్యవస్థాపక అధ్యక్షుడు కాసం రామయ్య గారు, ఆకుల నాగరాజు గారు తదితరులు పెద్ద ఎత్తున హాజరైనారు. మొదట సమావేశ కర్త జనగామ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పూర్వధ్యక్షులు పజ్జురి జయహరి గారు స్వాగతోపన్యాసం చేయగా,  చివరగా కార్యక్రమ నిర్వాహకులు శ్రీ జైన రమేశ్ గారు వందన సుమర్పణ గావించారు. తదనంతరం అందరికి షడ్రసోపేత భోజన కార్యక్రమము ఏర్పాటు చేశారు. కామెంట్‌లు