తోర్రురు ఇమ్మడి జ్యోతి పెళ్లికి సూత్రాలు మెట్టెలు అందజేసిన ఉప్పల


ఆర్ధిక  లేమితో ఏ పేదింటి  ఆడబిడ్డ బాధ పడకూడదని, వివాహ వేదికలో ముచ్చటగా మూడు ముళ్ళు వేయించుకునే సందర్భంలో ఏ చెల్లీ కంటతడి పెట్టకూడదని గత కొన్నేళ్లుగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, అంతర్జాతీయ వైశ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు ఉప్పల ఫౌండేషన్ తరపున వివాహం చేసుకునే ఆడ బిడ్డలకు బంగారు మంగళ సూత్రం, వెండి మెట్టెలు బహూకరిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు తొర్రూరుకు చెందిన పేద వైశ్య కుటుంబానికి చెందిన ఇమ్మడి జ్యోతికి బంగారు మంగళ సూత్రం, వెండి మెట్టెలు బహుకరించి ఆశీర్వదించారు.  ఏ కష్టం వచ్చినా శ్రీనన్న ఉన్నాడని ధైర్యం చెప్పిన ఉప్పల శ్రీనివాస్ గారు ఆర్యవైశ్య లెజెండ్, వారి ఉన్నత ఆదర్శాలకు జోహార్లు.


కామెంట్‌లు