వైస్ప్రొ వారు నిర్వహించిన రక్తదానశిబిరం


తేదీ 26.1.2020 రోజున 2500వ  వాసవిమాత ఆత్మార్పణము రోజున పంజాగుట్ట లోని టోపాజ్ ప్లాజా  సమావేశ మందిరంలో వైస్ప్రొ వారు నిర్వహించిన రక్తదానశిబిరం కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా మధుమోహన్ గారు వ్యవహరించగా ముఖ్య అతిథి గా ప్రఖ్యాత చలన చిత్ర ప్రొడ్యూసర్ టి.రామ సత్యనారాయణ గారు, గౌరవతిథిగా సి.ఏ దయాకర్ గారు విచ్ఛేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ చైర్మన్ గా సి.ఏ బచ్చుఁ శ్రీనివాస్ వ్యవహరించి రక్త దానం చేసిన సోషల్ వర్కర్ శ్రీనివాస్ గుప్తాను సన్మానించగా వారిని స్పూర్తిగా తీసుకుని మరికొందరు ఔత్సాహికులు రక్తదానం చేశారు. సంస్థ కార్యవర్గ సభ్యుల చేయూతతో కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. కామెంట్‌లు