అవోపా జఫర్గఢ్ వారి గణతంత్ర దినోత్సవాలు


71వ గణతంత్రదినోత్సవ వేడుకల సందర్భంగా జఫర్ గడ్ అవోపా మండల శాఖ ఆధ్వర్యంలో కళాశాల పాఠశాల విద్యార్థులకు  క్విజ్ పోటీలను నిర్వహించారు.  ఈ సందర్భంగా అవోపా అధ్యక్షులు తాటిపెల్లి సోమయ్య మాట్లాడుచూ గత 10 సంవత్సరాలనుండి క్రమం తప్పకుండ అవోపా ఆధ్వర్యంలో క్విజ్ పోటీలను, ఆర్యవైశ్య మహిళలకు రంగవల్లుల పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం  పోటీలలో గెలుపొందిన వారిని అభినందిస్తూ బహుమతులను ప్రధానం చేసారు. ఈ కార్యక్రమంలో అవోపా ఉపాధ్యక్షులు బెలిదె పూర్ణచందర్ , కార్యదర్శి అంచూరి సురేష్ , మండల ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి బొనగిరి శ్రవణ్ కుమార్ , పల్లా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు