కన్నె స్వాముల శబరిమల సందర్శనకు ఆర్థిక సహాయము


శబరిమల సందర్శన పవిత్రమైన పుణ్యకార్యము. ఆ క్షేత్రాన్ని, స్వామి అయ్యప్పను దర్శించుకోవాలంటే ఖర్చు పెట్టుకుని చాలా దూరము ప్రయాణం చేయవలసినదే. కాబట్టి కొందరు అయ్యప్ప మాలధరించిన స్వాములు డబ్బు కొరతతో శబరిమల దర్శనానికి వెనుకడుగు వేయుచున్నారు. ఒకప్పుడు అలాంటి పోలేని పరిస్థితులలో ఉండి ఇప్పుడు వరుసగా అయ్యప్ప మాల ధరించి ప్రతియేడూ అయ్యప్పస్వామిని దర్శించుకుంటున్న మహబూబ్నగర్ పట్టణ అవోపా అధ్యక్షుడు బి.టి.ప్రకాష్ బాబు  ఆయన కుమారుడు భీమా సుప్రజ్ కలిసి  తమవంతు సాయంగా ఇద్దరు పేద అయ్యప్ప స్వాములకు శబరిమల దర్శించుకునే అవకాశం కల్పించాలనే సంకల్పంతో ఇద్దరు కన్నెస్వాములకు శబరిమల వెళ్లేందుకు ఆర్థిక సహాయం చేశారు. ఇట్టి కార్యక్రమంలో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జిల్లా అధ్యక్షుడు సీమ నరేందర్ గారు, జిల్లా కోశాధికారి కే. సతీష్ కుమార్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టౌన్ అవోపా అధ్యక్షుడు బి.టి.ప్రకాష్ మాట్లాడుచూ వచ్చే సంవత్సరం కూడా కొంత మంది కన్నె స్వాములు శబరిమల కు పోవుటకు ఆర్థిక సహాయం చేయ సంకల్పించానని, పోలేనివారికి కూడా అయ్యప్ప కరుణా  కటాక్షాలు ప్రసరించాలని ప్రార్ధిస్తున్నానన్నాడు. అధ్యాత్మకంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకున్నాడని ప్రకాశ్ గారిని పలువురు ప్రశంసిస్తున్నారు.


కామెంట్‌లు