అల్ ఇండియా రేడియోలో సాయం కథా పఠనం


అల్ ఇండియా రేడియో హైదరాబాద్ లో ప్రతి సోమవారం ఉ.8.30కు నిర్వహించు కథాపఠనం శీర్షికలో తేదీ 4.11.2019 రోజున అవోపా న్యూస్ బులెటిన్ చీఫ్ ఎడిటర్ శ్రీ కూర చిదంబరం గారిని ఆహ్వానించి వారు రచించిన సాయం అను కథానిక ను చదివించారు. ఈ కథానిక నవ తెలంగాణ డైలీ న్యూస్ పేపర్లో కూడా ప్రచురితమైనది. ఈ కథానిక కథాంశం ఏమంటే సిటీ లోని ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో పనిచేయుచున్న వాచమన్ పడుచున్న బాధలను చూడలేక అతనికి అవసరమైన సాయం పలువురు కలిసి చేయడమే,  మరియు సాయం పొందిన వాచమన్ వ్యక్తం చేసిన కృతజ్ఞతను రచయిత చక్కగా హృదయానికి హత్తు కొనువిధంగా అభివర్ణిస్తూ అవసరార్థులకు మానవతా దృక్పథంతో అందరూ సాయం చేయాలన్న తన విజ్ఞప్తిని చక్కగా పొందు పరచారు.  ఇంత మంచి అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్న కూర చిదంబరం గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బుల్లెటిన్ ఎడిటర్ నూకా యాదగిరి గారు అభినందనలు తెలియజేయుచున్నారు. 


కామెంట్‌లు