అవోపా హన్మకొండ వారి ఆద్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు బంగారు  పథకాలు


అవోపా హన్మకొండ వారి ఆద్వర్యంలో  2018-19 విద్యా సంవత్సరంలో 10వ తరగతి, ఇంటర్, లా, డి.ఎడ్, బి.ఇడి, ఫార్మసీ, ఇంజనీరింగ్, మెడిసిన్, ఐ.ఐ.టి, జె.ఈ.ఈ, ఎంసెట్, నీట్, పాలిటెక్నీక్, పి.జి, పిహెచ్.డి, తదితర కోర్సుల్లో మంచి ప్రతిభ కనబరిచిన ప్రతిభావంతులైన విద్యార్థులకు 60 మందికి బంగారు  పథకాల ప్రదానోత్సవ కార్యక్రమమం డిశంబర్1వ తారీఖు ఆదివారం రోజున నిర్వహించుటకు నిర్ణయం తీసుకున్నామని తెలియజేస్తూ ఈరోజు వీటికి సంబంధించిన గోడ పత్రాలు, కరపత్రాలు విడుదల చేశారు. అర్హత కలిగిన విద్యార్థులు 24.11.2019 తేదీ లోగా హనుమకొండ సుబేదారి లోని అవోపా కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు. వివరాలకు 9849828952, 9390102029 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు.  ఈ కార్యక్రమంలో అవోపా, హన్మకొండ అధ్యక్షుడు యెల్లెంకి రవీందర్, ప్రదాన కార్యదర్శి కొల్లూరు ప్రకాశం, విద్యాకమీటి చైర్మన్ గంపా అశోక్ కుమార్, వైస్ చైర్మన్ అనంతుల కుమారస్వామి, ఏ శివకుమార్, మాడిశెట్టి శ్రీనివాస్ , శ్రీ మతి గంపా రజిత , శ్రీ మతి బ్రహ్మదేవర శారద , కందుకూరి ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు