బీద వైశ్య కుటుంబానికి చేయూత


జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ముత్తారం గ్రామ బీద వైశ్య కుటుంబీకుల గురించి వార్త పేపర్లో ప్రచురించపడగానే కాటారం మండల పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీ పెద్ది ఆంజనేయులు గారు గ్రామ సర్పంచ్ మరియు తదితర పెద్దలతో గ్రామ సభ ఏర్పాటు చేసి బీద వైశ్యుడు సుద్దాల నాగభూషణం అతని సోదరుడు అవిటి వారని ఏపని చేయలేక భిక్షాటన చేస్తూ తమదైన శిథిలమైన పూరిగుడిసెలో ఉంటూ జీవనం గడుపుచున్నారని, వ్యాపారం చేసే ఆర్థిక వనరులు లేక అవిటి తనంతో ఎవరివద్దా ఉద్యోగం కుదరక కుటుంబ సభ్యుల ఉదర పోషణార్థం భిక్షాటన చేయుచున్నాడని, అలాంటి బీద కుటుంబానికి అండగా వుండవసలసిన అవసరమున్నదని అందరికి నఛ్చచెప్పి వారికి కావలసిన నిత్యాన్నసరుకులు ఆర్థిక సహాయం అందజేయుటలో ముఖ్య పాత్ర పోషించి విషయాన్ని పై అధికారుల, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి విన్నవించి తగు సహాయము అందజేయుచున్న MPDO పెద్ది ఆంజనేయులు అభినందనీయులు. తదుపరి చర్యగా ఫేస్ బుక్, వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చే‌సి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పింఛను మంజూరీ చేయడం జరిగిందని, అలాగే స్థానిక మరియు జిల్లా ఆర్య వైశ్య సంఘం, వాసవీ క్లబ్ మొదలగు వారితో సమావేశం ఏర్పాటు చేసి అదే రోజు లక్ష పదివేల రూపాయలు జమ చేయడం జరిగిందనీ, సుద్దాల నాగభూషణం గారి పేర ఖాతా ప్రారంభించి అన్ని గ్రూప్ లలో పోస్ట్ చెయ్యడం వల్ల ఈ రోజు వరకు దాదాపు 4 లక్షలు ఖాతాలో జమ అయ్యాయనీ, ధర్మపురి, జగిత్యాల, చొప్పదండి ఆర్య వైశ్య సంఘాలు దాదాపు సంవత్సరానికి సరిపడా బియ్యం బట్టలు అందచేయడం జరిగిందనీ, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ బచ్చు శ్రీనివాస్ ఆధ్వర్యంలో  91 వేలు చెక్కు అందచేశారనీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు సిరుప అనిల్, వాసవీ క్లబ్ కాటారం అధ్యక్షులు కలికోట శ్రీనివాస్ జిల్లా గవర్నర్ పవిత్రం శ్రీనివాస్ లతో ఎప్పటికప్పుడు చర్చించి తదుపరి చర్యలు గైకొన‌‌‌ బడుచు న్నాయనీ,  స్థానిక తహసీల్దార్,  సర్పంచ్ యం.పి.టి.సి, జడ్.పి.టి.సి,ఆర్య వైశ్య మహా సభ ప్రతినిధి శాంతి కుమార్ మరియు కాటారం ప్రకాష్ తదితరులు కూడా సహకరిస్తున్నారనీ, ఇవియును కాక  ఎవరిిిిికి తోచిన సహయము వారు చేయవచ్నని పెద్ది ఆంజనేయులు MPDO గారు కోరుచున్నారు.  ఇంతటి మహత్కార్యము చేపట్టి సఫలీకృతుడగుచున్న పెద్ది అంజనేయులు గారికి తెలంగాణా రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బుల్లెటిన్ సంపాదక వర్గము అభినందనలు తెలుపు చున్నవి. 

 


కామెంట్‌లు